US Consulate: అమెరికా అత్యవసర వీసాలపై కాన్సులేట్ కీలక ప్రకటన
ABN , First Publish Date - 2022-09-28T12:54:00+05:30 IST
డిమాండ్ ఎక్కువగా ఉన్నా.. అమెరికా వెళ్లేందుకు అత్యవసర వీసాలను జారీ చేయలేమని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ మంగళవారం స్పష్టం చేసింది.
అత్యవసర వీసాలను అనుమతించలేం: యూఎస్ కాన్సులేట్
హైదరాబాద్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): డిమాండ్ ఎక్కువగా ఉన్నా.. అమెరికా వెళ్లేందుకు అత్యవసర వీసాలను జారీ చేయలేమని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ మంగళవారం స్పష్టం చేసింది. పర్యాటకులు ఇప్పుడు అన్ని కేటగిరీల వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని.. అయితే వేచిచూసే సమయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదని తెలిపింది. వీసా సంబంధిత అంశాలను నివృత్తి చేసుకునేందుకు యూఎస్ దౌత్య వ్యవహారాల మంత్రి డాన్ హెఫ్లిన్ ఈ నెల 29న మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక ఫేస్బుక్ పేజీ ద్వారా ప్రశ్నలు అడగవచ్చని తెలిపింది.