భారత్‌కు రావాలనుకునే ప్రయాణికులను ఉద్దేశించి అమెరికా కీలక సూచన
ABN , First Publish Date - 2022-01-26T21:49:10+05:30 IST
భారత్‌కు వచ్చే ప్రయాణికులను ఉద్దేశించి అగ్రరాజ్యం అమెరికా కీలక సూచన చేసింది. ప్రయాణం పునరాలో

ఎన్నారై డెస్క్: భారత్‌కు వచ్చే ప్రయాణికులను ఉద్దేశించి అగ్రరాజ్యం అమెరికా కీలక సూచన చేసింది. ప్రయాణం పునరాలోచించుకోవాలని కోరింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఒమైక్రాన్ రూపంలో ఈ మహమ్మారి విరుచుకుపడుతోంది. దీంతో అమెరికాలో సహా ఇండియాలో కూడా కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. భారత్‌లో ప్రతిరోజు లక్షల్లో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం తమ దేశ పౌరులకు కీలక సూచన చేసింది. భారత్ వెళ్లాలనుకునే ప్రయాణికులు పునరాలోచించుకోవాలని కోరింది. కేసులు పెరుగుతున్న క్రమంలో భారత్‌కు వెళ్లడం శ్రేయస్కరం కాదని పేర్కొంది. ఇదిలా ఉంటే.. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) లెవల్-3 దేశాల జాబితాలో చేర్చింది.