టీకా వేసుకోని దేశ పౌరుల విషయమై UAE కీలక నిర్ణయం..!

ABN , First Publish Date - 2022-01-02T18:56:21+05:30 IST

కరోనా వ్యాక్సిన్ వేసుకోని దేశ పౌరులు, నివాసితుల విషయమై యూఏఈ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

టీకా వేసుకోని దేశ పౌరుల విషయమై UAE కీలక నిర్ణయం..!

అబుధాబి: కరోనా వ్యాక్సిన్ వేసుకోని దేశ పౌరులు, నివాసితుల విషయమై యూఏఈ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అలాంటి వారిని విదేశాలకు వెళ్లకుండా బ్యాన్ చేసింది. జనవరి 10 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని నేషనల్ క్రైసిస్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌సీఈఎంఏ), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండ్ అంతర్జాతీయ సహకారం (ఎంఓఎఫ్ఏఐసీ) వెల్లడించాయి. ఈ మేరకు ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేశాయి. "2022 జనవరి 10 నుండి కోవిడ్-19 టీకాలు తీసుకోని యూఏఈ పౌరుల విదేశీ ప్రయాణంపై నిషేధం. రెండు డోసుల వ్యాక్సిన్ పొందిన వారు బూస్టర్ డోస్ తీసుకోవడం అవసరం" అని ప్రకటనలో పేర్కొన్నాయి. అలాగే కొన్ని ప్రత్యేక కేటగిరీలకు చెందిన కొంతమందికి మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చాయి. 


ఈ కింది కేటగిరీలకు చెందిన టీకాలు తీసుకోని పౌరులకు మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉంటుంది

* వైద్యపరంగా వ్యాక్సిన్ నుంచి మినహాయించబడిన వారు

* మానవతా కేసులు

* వైద్య మరియు చికిత్స కోసం ప్రయాణించే వారుUpdated Date - 2022-01-02T18:56:21+05:30 IST