అదృష్టాన్ని వెంబడించి చేజిక్కించుకున్న NRI.. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించి..

ABN , First Publish Date - 2022-07-11T21:33:38+05:30 IST

జాక్‌పాట్ కొట్టడం కొట్టకపోవడం మన చేతుల్లో ఉండదు..! రాసిపెట్టి ఉంటే కానీ లక్ కలిసిరాదు. ఇలా ఆలోచించే చాలా మంది లాటరీల జోలికిపోరు. కానీ.. తమిళనాడుకు చెందిన మనోజ్ మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించాడు.

అదృష్టాన్ని వెంబడించి చేజిక్కించుకున్న NRI.. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించి..

ఎన్నారై డెస్క్: జాక్‌పాట్ కొట్టడం కొట్టకపోవడం మన చేతుల్లో ఉండదు..! రాసిపెట్టి ఉంటే కానీ లక్ కలిసిరాదు. ఇలా ఆలోచించే చాలా మంది లాటరీల జోలికిపోరు. కానీ.. తమిళనాడుకు చెందిన మనోజ్ మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించాడు.  అలుపెరగకుండా ప్రయత్నించి చివరికి అదృష్టాన్ని కూడా చేజిక్కించుకున్నాడు. యూఏఈలో ఉండే మనోజ్..  కొన్నేళ్ల పాటు వరుస పెట్టి లాటరీ టిక్కెట్లు కొనడంతో తాజాగా అతడి దశ తిరిగింది.   


ఇటీవల జరిగిన లక్కీ డ్రాలో మనోజ్  77,777 దిర్హామ్స్ గెలుచుకున్నాడు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది సుమారు రూ.17 లక్షలు. ఇన్నాళ్ల పాటు సాగించిన ప్రయత్నాలు అనుకున్న ఫలితాన్ని ఇవ్వడంతో మనోజ్ ఆనందానికి పట్టపగ్గాలే లేకుండా పోయాయి. కొన్నేళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నా కూడా తనకు అదృష్టం కలిసిరాలేదని మనోజ్ మీడియాకు తెలిపాడు. అయినా కూడా పట్టువిడవకుండా తన ప్రయత్నాలను కొనసాగించానన్నాడు. ఇటీవల ఓ రోజు మనోజ్ లాటరీ గెలుచుకున్నట్టు అతడి మిత్రుడు సమాచారమివ్వడంతో మనోజ్ ఉబ్బితబ్బిబ్బైపోయాడు. 


ఈ డబ్బులో కొంత మొత్తాన్ని తన అవరాల కోసం వినియోగించుకుంటానన్న మనోజ్.. మిగితా మొత్తంతో అవసరంలో ఉన్న బంధువులు, స్నేహితులకు సాయం చేస్తానన్నాడు. ఇక దుబాయ్‌లోని మరో భారతీయుడికి లాటరీని నమ్ముకుని రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. గతవారం మహసూజ్ డ్రాలో గెలిచిన అనీష్‌.. ఏకంగా రూ.21 కోట్లు రూపాయలు సొంతం చేసుకున్నారు. 

Updated Date - 2022-07-11T21:33:38+05:30 IST