అమెరికాలో ముగ్గురు తెలుగువారి మృతి
ABN , First Publish Date - 2022-10-27T08:43:05+05:30 IST
అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వరంగల్‌కు చెందిన ఓ యువతి సహా ముగ్గురు తెలుగు వారు దుర్మరణం పాలయ్యారు. షెఫీల్డ్ రోడ్డు-7లో మంగళవారం ఉదయం 5.15-5.30 గంటల సమయంలో..
మృతుల్లో వరంగల్ యువతి
గిర్మాజిపేట, అక్టోబరు 26 : అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వరంగల్‌కు చెందిన ఓ యువతి సహా ముగ్గురు తెలుగు వారు దుర్మరణం పాలయ్యారు. షెఫీల్డ్ రోడ్డు-7లో మంగళవారం ఉదయం 5.15-5.30 గంటల సమయంలో తెలుగు వారు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్‌ను ఓ పికప్ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరంగల్‌కు చెందిన గుల్లపెల్లి పావని (23), హైదరాబాద్‌కు చెందిన ప్రేమ్‌కుమార్ రెడ్డి, ఏపీకి చెందిన పాటంశెట్టి సాయి నరసింహ(22) మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. వరంగల్, గిర్మాజిపేటలోని లక్ష్మిపురానికి చెందిన పావని.. ఎంఎస్ చదివేందుకు రెండు నెలల క్రితమే అమెరికా వెళ్లింది. పావని తల్లి కల్పన ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు, తండ్రి రమేష్ అడ్తి దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నారు. ఇక, ఏపీ, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని బుర్రిలంకలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన పాటంశెట్టి సాయి నరసింహ(22) ఈ ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లారు.