అమెరికాలో దారుణం.. ఇద్దరు మహిళలను చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి!

ABN , First Publish Date - 2022-06-04T02:30:04+05:30 IST

అమెరికాలో మళ్లీ తుపాకీ కలకలం రేగింది. గురువారం ఓ వ్యక్తి ఇద్దరు మహిళలను తుపాకీతో కాల్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

అమెరికాలో దారుణం.. ఇద్దరు మహిళలను చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి!

ఎన్నారై డెస్క్: అమెరికాలో మళ్లీ తుపాకీ కలకలం రేగింది. గురువారం ఓ వ్యక్తి ఇద్దరు మహిళలను తుపాకీతో కాల్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఐయోవా రాష్ట్రంలోని ఏమ్స్ నగరంలోని ఓ చర్చ్‌ పక్కనున్న పార్కింగ్ స్థలంలో ఈ దారుణం జరిగింది. గన్‌ వైలెన్స్‌పై అమరికా అధ్యక్షుడు బైడెన్ మరో రాష్ట్రంలో ప్రసంగించిన సందర్భంలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికే ముగ్గురూ విగతజీవులుగా పడి ఉన్నారు. మరోవైపు.. విస్కాన్సిన్‌లో ఓ వ్యక్తి అంత్యక్రియల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. ఇటీవల కాలంలో అమెరికాలో పలుకాల్పుల ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తుపాకీ సంస్కృతిని ఎలా నియత్రించాలనే దానిపై అక్కడి ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది.  Updated Date - 2022-06-04T02:30:04+05:30 IST