బహ్రెయిన్‌లో బాల్కొండ వాసి మృతి

ABN , First Publish Date - 2022-04-17T13:35:17+05:30 IST

బతుకుదెరువు కోసం బెహ్రెయిన్ దేశం వెళ్లిన తూడుం శ్రీనివాస్(45) గుండెపోటుతో మృతిచెందాడు.

బహ్రెయిన్‌లో బాల్కొండ వాసి మృతి
మృతుడు శ్రీనివాస్..

బాల్కొండ, ఏప్రిల్ 16: బతుకుదెరువు కోసం బెహ్రెయిన్ దేశం వెళ్లిన తూడుం శ్రీనివాస్(45) గుండెపోటుతో మృతిచెందాడు. శుక్రవారం ఉదయం గుండెపోటు రాగా స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు చెప్పారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. టీఆర్ఎస్ నాయకుడు జంగం రాజేశ్వర్ రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ సహాయం కావాలని కుటుంబీకులు కోరుతున్నారు.

Updated Date - 2022-04-17T13:35:17+05:30 IST