నా జాగ్వార్, చిరుతనూ అనుమతించండి.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు వైద్యుడి వేడుకోలు
ABN , First Publish Date - 2022-03-08T13:19:18+05:30 IST
ఉక్రెయిన్‌లో చిక్కుబడిపోయిన తెలుగు వైద్యుడు డాక్టర్ గిరికుమార్ పాటిల్‌కు విచిత్రమైన సమస్య ఎదురైంది.

కీవ్, మార్చి 7: ఉక్రెయిన్‌లో చిక్కుబడిపోయిన తెలుగు వైద్యుడు డాక్టర్ గిరికుమార్ పాటిల్‌కు విచిత్రమైన సమస్య ఎదురైంది. స్వదేశానికి తిరిగొచ్చే క్రమంలో.. తనతో పాటు తన పెంపుడు జంతువులను కూడా అనుమతించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని ఇండియన్ ఎంబసీ తిరస్కరించింది. దీంతో ఆయన.. అవి లేకుండా తాను తిరిగి రాలేనని, ఎలాగైనా వాటిని కూడా తనతో అనుమతించాలని వేడుకుంటున్నారు. ఇంతకీ ఆయన పెంపుడు జంతువులు ఏవో తెలుసా..! 20 నెలల వయసున్న జాగ్వార్, 6 నెలల వయసున్న చిరుత. ఈ రెండింటినీ ఆయన కీవ్ జూ నుంచి తెచ్చుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. తనుంటున్న ప్రాంతాన్ని రష్యా దళాలు చుట్టుముట్టాయని, తనను తన ‘బిడ్డల’తో పాటు కాపాడాలని వేడుకుంటున్నారు. కాగా, డాక్టర్ గిరికుమార్ పాటిల్.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన వారు. 2007లో మెడిసిన్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లారు. అనంతరం అక్కడే స్థిరపడ్డారు.