‘మార్ఫింగ్‌’ ఎన్నారైలకు వార్నింగ్..!

ABN , First Publish Date - 2022-01-05T12:47:48+05:30 IST

విదేశాల్లో ఉంటూ.. వేర్వేరు ఐపీ అడ్ర్‌సలతో.. ఇక్కడి ప్రముఖులు, మహిళల, రాజకీయ నేతల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి.. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే ఎన్నారైలకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ గట్టి హెచ్చరిక ఇచ్చారు. అధునాతన సాంకేతికతో నిందితులను గుర్తిస్తామని.. విద్వేష పోస్టులు, మార్ఫింగ్‌కు పాల్పడే ఎన్నారైల..

‘మార్ఫింగ్‌’ ఎన్నారైలకు వార్నింగ్..!

పాస్‌పోర్ట్‌ రద్దు చేస్తాం.. లుక్‌ఔట్‌ నోటీసులిస్తాం

అసభ్య పోస్టులు పెడితే మూల్యం తప్పదు

హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ హెచ్చరికలు

వీడియో కాన్ఫరెన్స్‌లో సైబర్‌ నేరాలపై ఫోకస్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉంటూ.. వేర్వేరు ఐపీ అడ్ర్‌సలతో.. ఇక్కడి ప్రముఖులు, మహిళల, రాజకీయ నేతల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి.. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే ఎన్నారైలకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ గట్టి హెచ్చరిక ఇచ్చారు. అధునాతన సాంకేతికతో నిందితులను గుర్తిస్తామని.. విద్వేష పోస్టులు, మార్ఫింగ్‌కు పాల్పడే ఎన్నారైల పాస్‌పోర్టులను రద్దు చేస్తామని హెచ్చరించారు. వారిపై కేసులు నమోదు చేసి.. లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేస్తామన్నారు. ఆయా దేశాలు ఇచ్చిన వీసాలను కూడా రద్దుచేయిస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఉంటూ.. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని పోలీసులు ఎప్పటికప్పుడు అరెస్టు చేస్తుండడంతో.. కొందరు ఎన్నారైల ద్వారా ఆ పని చేయిస్తున్న నేపథ్యంలో ీ   ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. సీపీగా చార్జ్‌ తీసుకున్నాక మంగళవారం తొలిసారి నగరంలోని ఎస్‌హెచ్‌వో మొదలు.. ఏసీపీలు, డీసీపీలు, జాయింట్‌ సీపీలు, అదనపు సీపీలతో సైబర్‌ నేరాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.   సైబర్‌నేరాల దర్యాప్తు తీరుపై సూచనలు చేశారు. ‘‘అసభ్యకర పోస్టులను గుర్తిస్తే..  సంబంధిత సామాజిక మాధ్యమ సంస్థలతో సంప్రదించి, వాటిని డిలీట్‌ చేయించాలి.   సైబర్‌ నేరాల దర్యాప్తులో ప్రతి ఎస్‌హెచ్‌వో పాలుపంచుకోవాలి’’ అని పేర్కొన్నారు.


ఇతర అంశాలపై సీపీ సూచనలు..

ప్రజలకు న్యాయం చేయడానికి కృషిచేయాలి. బాధితులెవరికీ అన్యాయం జరగకూడదు ఫ ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కారం కావాలంటే.. రోడ్ల మీద విజిబుల్‌ ట్రాఫిక్‌ పోలీసింగ్‌ ఉండాలి ఫ ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్‌ నిషేధాజ్ఞలను అమలు చేయాలి.

Updated Date - 2022-01-05T12:47:48+05:30 IST