టెక్సాస్ గవర్నర్‌కు TANA రిసెప్షన్

ABN , First Publish Date - 2022-03-05T17:13:40+05:30 IST

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్‌ కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రత్యేకంగా రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

టెక్సాస్ గవర్నర్‌కు TANA రిసెప్షన్

డల్లాస్, టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్‌ కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రత్యేకంగా రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 3న డల్లాస్‌లో ఈ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు భారతీయ అమెరికన్ ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ అమెరికన్లకు అబాట్ సపోర్ట్ మరిచిపోలేనిదని అన్నారు. ముఖ్యంగా ఇండో-అమెరికన్ వాణిజ్య సంబంధాలకు అబాట్ గొప్ప మద్దతుదారు అని పేర్కొన్నారు. తానా తన కోసం ఏర్పాట్లు చేసిన ఈ ప్రత్యేక ఈవెంట్ పట్ల గవర్నర్ గ్రెగ్ అబాట్ హర్షం వ్యక్తం చేశారు. 

Read more