బోస్టన్‌లో TANA ఫౌండేషన్ 5కే రన్ విజయవంతం

ABN , First Publish Date - 2022-06-26T18:58:51+05:30 IST

తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి సారథ్యంలో బోస్టన్‌లో జరిగిన 5కే రన్ విజయవంతం అయ్యింది.

బోస్టన్‌లో TANA ఫౌండేషన్ 5కే రన్ విజయవంతం

బోస్టన్: తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి సారథ్యంలో బోస్టన్‌లో జరిగిన 5కే రన్ విజయవంతం అయ్యింది. 200 మందికి పైగా పెద్దలు, 50 మంది వరకు పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ రన్‌లో పాల్గొన్నారు. తానా ఫౌండేషన్ దాతల ఆర్థిక సహకారంతో  చేస్తున్న ఎన్నో కార్యక్రమాల వివరాలను  శశికాంత్ వివరించారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు మోహన్ నన్నపనేని, నిర్వాణ హెల్త్ సీఈఓ రవి ఇకా, కోటేష్ కందుకూరి, రావు యలమంచిలి, శ్రీనివాస్ కొల్లిపర, సిటీ కోఆర్డినేటర్ కె పి సోంపల్లి, ప్రశాంత్ కాట్రగడ్డ, సూర్య తేలప్రోలు, శ్రీనివాస్ ఎండూరి, గోపి నక్కలపూడి, స్థానిక తానా ప్రతినిధులు పాల్గొన్నారు. తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, రవి సామినేని, సుమంత్ రామిశెట్టి, వీర లెనిన్ తుళ్లూరి ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు.

Updated Date - 2022-06-26T18:58:51+05:30 IST