ఫిలడెల్ఫియాలో ఘనంగా ‘తానా’ వనభోజనాలు..

ABN , First Publish Date - 2022-09-29T02:25:37+05:30 IST

ఉత్తర అమెరికాలో ప్రవాస తెలుగు వారికి అలనాటి నుంచి ఆసరాగా నిలిచిన లాభాపేక్షలేని సంస్థలలో తానా ఒకటి. తానా నిర్వహించే కార్యక్రమాల గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అందరూ బాగుండాలి, అందులో తెలుగువారు ఉండాలి’ అనే సిద్ధాంతంతో అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, ఓక్స్ నగరంలోని లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ పార్కులో సెప్టెంబర్ 2

ఫిలడెల్ఫియాలో ఘనంగా ‘తానా’ వనభోజనాలు..

ఎన్నారై డెస్క్: ఉత్తర అమెరికాలో ప్రవాస తెలుగు వారికి అలనాటి నుంచి ఆసరాగా నిలిచిన లాభాపేక్షలేని సంస్థలలో తానా ఒకటి. తానా నిర్వహించే కార్యక్రమాల గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అందరూ బాగుండాలి, అందులో తెలుగువారు ఉండాలి’ అనే సిద్ధాంతంతో అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, ఓక్స్ నగరంలోని లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ పార్కులో సెప్టెంబర్ 25న మిడ్ అట్లాంటిక్ తానా టీం తానా వనభోజనాలు, ఆత్మీయ కలయిక తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఫిలడెల్ఫియా‌ నగర పరిధిలో నివాసముంటున్న సుమారు ఎనిమిది వందల మంది తెలుగు వాళ్లు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పిల్లలు, పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టి లేపే పలు క్రీడలను నిర్వహించారు. గడిచిన సంవత్సరాలలో ఫిలడెల్ఫియా టీం ఇటువంటి కార్యక్రమాలను ఎన్నింటినో విజయవంతంగా నిర్వహించినా.. ఈ సారి వచ్చిన విశేష స్పందనతో లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ పార్క్ మొత్తం కిక్కిరిసిపోయింది. వరుణ దేవుడు తన ప్రతాపం చూపించినా, లెక్కచేయకుండా వనభోజనాలకు వచ్చిన అశేష తెలుగువారి కోలాహలంతో పార్కు పరిసరాలు సందడిగా మారాయి. ఈ వనభోజనాల కార్యక్రమానికి  పక్క రాష్ట్రాలైన న్యూ జెర్సీ, డెలావేర్ నుంచి కూడా తెలుగు ప్రజలు హాజరయ్యారు. టెక్సాస్ నుంచి నాగరాజు నలజుల, వర్జీనియా నుంచి బాబీ యెర్ర, ఫ్లోరిడా నుంచి సాయి జరుగుల ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విచ్చేశారు. పసందైన విందులతో, ఆటపాటలతో సాగిన ఈ కార్యక్రమాన్ని కొంత సమయం వరుణుడు అంతరాయం కలిగించినా, అందరు ఉరకలిడే ఉత్సాహంతో ఎన్ఠీఆర్ గారి  "వేటగాడు" చిత్రంలోని "ఆకు చాటు పింద తడిసే", ఏన్ఆర్ గారి "ఆత్మా బలం" చిత్రంలోని "చిటపట చినుకులు పడుతూ ఉంటే" తదితర వాన పాటలకు ఎంతో జోష్‌తో చిందులు వేశారు.



చివరగా వనభోజనాలు ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని అక్కడకు విచ్చేసిన పలువురు తానా నాయకులు మిడ్ అట్లాంటిక్ ఫిలడెల్ఫియా టీంను ప్రశంసించారు. ప్రకృతి ఒడిలో ఆటలాడుతూ, సేద తీరుతూ, ఆదివారాన్ని ఆసాంతం ఆస్వాదించేలా చేశారని అక్కడకు హాజరైన పలువురు తెలుగు వాళ్లు తమ అనుభూతిని నిర్వాహకులతో పంచుకున్నారు. డాలర్ డ్రీమ్స్ సాఫల్యం చేసుకునే ఈ గజిబిజి గందరగోళ పరుగులో, తాము మరచిపోతున్న తెలుగింటి సంప్రదాయాలను, గతానుభూతులను నెమరువేసుకున్నారు. ఇంతమంది తెలుగువారు ఒకచోట కూర్చుని బంతి భోజనాలు చేయడం, అటపాటలతో కేరింతలతో హోరేత్తించడం తమకు ఎంతో తృప్తినిచ్చిందంటూ ఫిలడెల్ఫియా తానా టీంవారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ వనభోజనాల కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానితులకి మిడ్-అట్లాంటిక్ టీం సభ్యులు రుచికరమైన ఇంటి భోజనాలు వడ్డించారు.



ఈ సందర్భంగా తానా మిడ్ అట్లాంటిక్ కోఆర్డినేటర్ సునీల్ కోగంటి మాట్లాడుతూ.. 23వ తానా మహాసభలు 2023 జులై 7 నుంచి 9 వరకు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో  తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, మహాసభల కోఆర్డినేటర్ పొట్లూరి రవి నేతృత్వంలో అంగరంగ వైభవంగా జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఏర్పాట్లలో భాగంగా నవంబర్ 5న పెన్సిల్వేనియా వార్మినిస్టర్ నగరంలోని ఫ్యూజ్ బాంక్వెట్ హాల్‌లో తానా 23వ మహాసభల ‘కిక్ ఆఫ్ డిన్నర్’ ఏర్పాటు చేస్తున్నామన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి తానా నాయకత్వం హాజరు అవుతున్నారని, తెలుగు ప్రజలంతా హాజరై సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 


తానా లీడర్షిప్ టీం నుంచి ఈ కార్యక్రమంలో సునీల్ కోగంటి, రాజా కసుకుర్తి, విద్య గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి, తానా 23వ మహాసభల కోఆర్డినేటర్ పొట్లూరి రవి, పాఠశాల చైర్ నాగరాజు నలజుల, టీం స్క్వేర్ కోచైర్ కిరణ్ కొత్తపల్లి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వనాథ్ కోగంటి, హరనాథ్ దొడ్డపనేని, లీలా కృష్ణ దావులూరి, శ్రీనివాస్ భారతవరపు, సుధాకర్ కంద్యాల, కృష్ణ నందమూరి, రాహుల్ యెర్ర, సాయి జరుగుల, రత్న మూల్పూరి, మూర్తి నూతనపాటి, రవి ఇంద్రకంటి, పవన్ నడింపల్లి, హరీష్ అన్నాబత్తిన, ప్రవీణ్ ఇరుకులపాటి, సురేష్ కంకణాల, శ్రీధర్ సాదినేని, శ్రవణ్ లంక, గౌరీ కర్రోతు, సతీష్ నల్లా, సౌజన్య ఉన్నవ తదితరులు సహాయ సహకారాలు అందించారు. అలాగే స్పోర్ట్స్, గేమ్స్‌ను యూత్ వాలంటీర్ మన్విత యాగంటి మరియు తానా ఫిలడెల్ఫియా ఉమెన్స్ టీం కోఆర్డినేట్ చేశారు. రుచికరమైన చిక్కని కాఫీ స్పాన్సర్ చేసినందుకు గాను భూమి కాఫీ ప్రొప్రైటర్ శ్రీ పాపారావు ఉండవల్లి, తానా మిడ్ అట్లాంటిక్ కార్యక్రమాలకు సహకరిస్తున్న స్ప్రూస్ ఇన్ఫోటెక్ వేణు సంగాని తదితరులకు తానా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.



అన్నదాతల వివరాలు..

రవి పొట్లూరి, సునీల్ కోగంటి, రవి మందలపు, కిరణ్ కొత్తపల్లి, సతీష్ తుమ్మల, హరి మోటుపల్లి, రఘు ఎద్దులపల్లి, హరనాథ్ దొడ్డపనేని, హరి మోటుపల్లి, సాంబయ్య కోటపాటి, ఫణి కంతేటి, రంజిత్ మామిడి, చలం పావులూరి, రామ ముద్దన, కోటిబాబు యాగంటి, మోహన్ మల్ల, వంశి నలజాల, అను తుమ్మల, రవి తేజ ముత్తు, లీల కృష్ణ దావులూరి, సుధాకర్ కంద్యాల, ఇందు సందడి, సరోజ యాగంటి, రాజేశ్వరి కోడలి, స్వరూప కోటపాటి, కవిత మందలపు, రూప ముద్దన, లక్ష్మి అద్దంకి, కవిత చిడిపోతు, లక్ష్మి అడ్డంకి, భవాని మామిడి, విజయశ్రీ పరుచూరి,  మనీషా మేకా, నాయుడమ్మ యలవర్తి, భాస్కర్ దొప్పలపూడి తదితరులు. 


Read more