Money Saving Tips: Dubai లో ఉండే ప్రవాసులూ.. రోజువారీ ఖర్చులు తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి

ABN , First Publish Date - 2022-09-13T18:40:25+05:30 IST

మహమ్మారి కరోనా కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేల్ అయ్యాయి. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి.

Money Saving Tips: Dubai లో ఉండే ప్రవాసులూ.. రోజువారీ ఖర్చులు తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి

దుబాయ్: మహమ్మారి కరోనా కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేల్ అయ్యాయి. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. దాంతో రోజువారీ ఖర్చులు మధ్యతరగతి, దిగువ తరగతి వారికి చుక్కలు చూపిస్తున్నాయి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక ఇతర దేశాల్లో ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్లిన ప్రవాసులు ఈ విషయంలో కూసింత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే అక్కడి మార్కెట్లపై మనకు అంతగా అవగాహన ఉండదు. ఏ రోజుల్లో ఏ ప్రాంతంలో తక్కువ ధరలకు మనకు కావాల్సిన వస్తువులు అందుబాటులో ఉంటాయో తెలుసుకుంటే ఎంతోకొంత రోజువారీ ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఇదే కోవలో ఇప్పుడు మనం దుబాయ్‌లో ఉండే ప్రవాసులు రోజువారీ ఖర్చులు తగ్గాలంటే పాటించాల్సిన కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం. అక్కడ పౌల్ట్రీ, సీఫుడ్, పండ్లు, కూరగాయలు ఇలా ఇవన్నీ కూడా వారంలో ఓ రోజున చాలా చౌకగా దొరుకుతాయి. ఆయా రోజుల్లో మనం వాటిని కొనుగోలు చేస్తే మనకు రోజువారీ వ్యయం కొంచెం తగ్గుతుంది. 




సీఫుడ్ కొనాలంటే బుధవారమే బెస్ట్..

దుబాయ్‌లో ఉన్న ప్రవాసులు చేపలు, రోయ్యలు ఇలా ఇతర సీఫుడ్స్ తినాలంటే వారంలో బుధవారం నాడు వీటి ధరలు బాగా తక్కువగా ఉంటాయట. ఆ రోజు వీటిని సాధారణంగా ఉండే ధరల కంటే చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇది అక్కడి ఓ సంస్థ గత రెండేళ్ల సీఫుడ్ ధరల డేటా ఆధారంగా ఓ నివేదికను తయారు చేసింది. వారం ప్రారంభంలో ఉండే ధరలతో పోలిస్తే బుధవారం నాడు చాలా వరకు ధరలు తక్కువగా ఉంటున్నాయని నివేదిక స్పష్టం చేసింది. సీబాస్, హామర్, కింగ్ ఫిష్, సాల్మన్, సీ బ్రీమ్, రోయ్యలు ఇలా అన్ని రకాల సీఫుడ్స్ బుధవారం నాడు చౌకగా దొరుకుతున్నట్లు పేర్కొంది. ఇలా గడిచిన 96 వారాలుగా ఇదే పంతా కొనసాగుతున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. 


పండ్ల కొనుగోలుకైతే వీకెండ్స్..

 ఫ్రూట్స్ కొనుగోలు చేయాలంటే వీకెండ్స్ బెస్ట్. అక్కడి పండ్ల ధరలను బట్టి గత 24 నెలల డేటా ఆధారంగా ఈ విషయం తెలిసింది. సో.. వారం ప్రారంభంలో కంటే వీకెండ్స్‌లో ఫ్రూట్స్ షాపింగ్ కొంత మిగులుస్తుందని తెలుస్తుంది. ఉదాహరణకు అరటి పండ్లనే తీసుకుంటే.. వారం మధ్యంతరంలో కంటే వారాంతంలో చాలా చీప్‌గా దొరుకుతాయట. ఇలా ఆది, సోమవారాల్లో ఫ్రూట్స్ ధరలు చౌకగా ఉంటాయని నివేదిక తెలిపింది.


వారం మధ్యలో కూరగాయలు చౌక..

ఇక కూరగాయల విషయానికి వస్తే వారం మధ్యలో చౌకగా లభిస్తాయట. టమోటలు, బంగాళదుంపలు, దోసకాయలు, పాలకూర ఇలా కూరగాయలన్నింటి ధరలు వారం మధ్యలో తక్కువగా ఉంటున్నట్లు 96 వారాల డేటా ఆధారంగా తెలిసింది. కనుక కూరగాయలు కొనాలనుకునే ప్రవాసులు ఈ సమయంలో వాటిని కొనుగోలు చేయడం బెటర్. 


చికెన్‌కు సోమవారమైతే బెటర్..

చికెన్ ధర చాలా వరకు సోమవారం తక్కువగా ఉంటుందని 24 నెలల డేటా ఆధారంగా తెలిసింది. అలాగే గుడ్లు కూడా ఇదే రోజున చౌకగా దొరుకుతాయట. వీక్ స్టార్టింగ్ కంటే సోమవారం రోజున చికెన్ చౌకగా దొరుకుతుంది. ప్రస్తుతం అక్కడ కిలో చికెన్ 9 దిర్హమ్లు(రూ.194) ఉంది. అలాగే బీఫ్, మటన్ కూడా ఇదే రోజున తక్కువ ధరకు దొరుకుతాయట. 


ఇక దుబాయ్‌లో ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఇలా..

Updated Date - 2022-09-13T18:40:25+05:30 IST