Saudi Arabia: ఫ్రెండ్ పార్టీకి వెళ్లొదన్న భర్త.. రెచ్చిపోయిన భార్య.. గాజుకప్పుతో అతడిని విచక్షణారహితంగా..
ABN , First Publish Date - 2022-08-14T22:58:58+05:30 IST
ఫ్రెండ్ పార్టీకి వెళ్లొద్దన్న భర్తపై విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డ ఓ వివాహితకు సౌదీ అరేబియాలో(Saudi Arabia) తాజాగా ఆరు రోజుల జైలు శిక్ష పడింది.

ఎన్నారై డెస్క్: ఫ్రెండ్ పార్టీకి వెళ్లొద్దన్న భర్తపై విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డ ఓ వివాహితకు సౌదీ అరేబియాలో(Saudi Arabia) తాజాగా ఆరు రోజుల జైలు శిక్ష పడింది. గాజు కప్పుతో(Glass cup) నిందితురాలు తన భర్తను కొడ్డటంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక మీడియా కథనం ప్రకారం.. తన ఫ్రెండ్ ఏర్పాటు చేసిన పార్టీకి వెళతానని ఆమె తన భర్తను కోరింది. అందుకు అతడు అంగీకరించలేదు. దీంతో వారిద్దరి మధ్య తీవ్రవాదులాట జరిగింది.
ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన మహిళ తన చేతికందిన గాజు కప్పుతో అతడిపై దాడికి తెగబడింది. అతడి నుదుటిపై పెద్ద దెబ్బ వైద్యులు..గాయానికి పది కుట్లు వేయాల్సి వచ్చింది. ఇక బాధితుడు తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను విచారించగా భర్తను తాను కప్పుతో కొట్టిన మాట వాస్తవమేనని ఆమె అంగీకరించింది. తమ మధ్య జరిగిన గొడవ గురించి ఆమె కోర్టులోనూ వివరించింది. దీంతో.. న్యాయస్థానం ఆమెకు ఆరు రోజుల జైలు శిక్ష విధించింది.