సౌదీ మహిళలకు మరో బంపరాఫర్!

ABN , First Publish Date - 2022-01-05T12:57:46+05:30 IST

సౌదీ మహిళలు కార్లు నడపడం, రేసింగ్‌లలో దూసుకుపోవడమే కాదు.. త్వరలో హైస్పీడ్‌ రైలును పరుగులు పెట్టించనున్నారు.

సౌదీ మహిళలకు మరో బంపరాఫర్!

హైస్పీడ్‌ రైలు పైలట్లుగా శిక్షణ

రియాద్‌, జనవరి 4: సౌదీ మహిళలు కార్లు నడపడం, రేసింగ్‌లలో దూసుకుపోవడమే కాదు.. త్వరలో హైస్పీడ్‌ రైలును పరుగులు పెట్టించనున్నారు. హరమైన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పైలట్లుగా విధులు నిర్వహించేందుకు శిక్షణ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సౌదీ మహిళలను ఆ దేశ రైల్వే పాలిటెక్నిక్‌(ఎ్‌సఆర్‌పీ) కోరింది. ఇది మహిళలను సరికొత్త స్థాయికి తీసుకెళ్తుందని పేర్కొంది. గంటకు 300 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించే హరమైన్‌ హైస్పీడ్‌ రైలు 2018లో పట్టాలెక్కింది. 

Read more