Saudi Arabia: ఇప్పటి వరకు 64 లక్షల మంది అరెస్ట్.. వీళ్లు చేసిన నేరం ఏంటంటే..
ABN , First Publish Date - 2022-08-14T16:56:03+05:30 IST
సౌదీ అరేబియా అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు. కేవలం 6 రోజుల్లోనే 14,837 మందిని అదుపులోకి తీసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. అరెస్ట్ అయిన వాళ్లు ఎవ

ఎన్నారై డెస్క్: సౌదీ అరేబియా అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు. కేవలం 6 రోజుల్లోనే 14,837 మందిని అదుపులోకి తీసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. అరెస్ట్ అయిన వాళ్లు ఎవరు? వాళ్లు ఏం తప్పు చేశారు? అనే విషయాలు తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
సౌదీ అరేబియా(Saudi Arabia) కఠిన చట్టాలకు, శిక్షలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచన దేశాల్లో ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా.. ఈ దేశం గత కొంత కాలంగా అక్రమ నివాసితుల సమస్యతో ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో పలు విభాగాల్లోని సెక్యూరిటీ అధికారులు 2017లో కీలక నిర్ణయం తీసుకున్నారు. 15 నవంబర్ 2017లో జాయింట్ ఫీల్డ్ క్యాంపెయిన్స్ (joint field campaigns) ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా సౌదీ అరేబియాలోకి అక్రమంగా నివసిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆగస్ట్ 6-12 మధ్య కేవలం ఆరు రోజుల్లో రెసిడెన్సీ, లేబర్, బార్డర్ సెక్యూరిటీ చట్టాలు(residency, labour, and border security laws) ఉల్లఘించిన 14,837 మందిని అదుపులోకి తీసుకున్నట్టు సోషల్ మీడియా(social media) ద్వారా అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా అక్రమ నివాసితులకు సహాయం చేస్తే.. 15 ఏళ్లపాటు జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా దేశ పౌరులను హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. జాయింట్ ఫీల్డ్ క్యాంపెయిన్స్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 64,19,163 మందిని చట్టాలు ఉల్లఘించిన నేరం కింద సెక్యూరిటీ అధికారులు అరెస్టు చేశారు. ఇందులో 47లక్షల మంది రెసిడెన్సీ చట్టాలను, 8.23లక్షల మంది లేబర్ చట్టాలను, 8.95లక్షల మంది బార్డర్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించినట్టు సమాచారం.