కరోనా ఆంక్షలను మరింతగా సడలించిన సౌదీ అరేబియా..!

ABN , First Publish Date - 2022-06-22T02:50:16+05:30 IST

పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా వివిధ దేశాలు కరోనా ఆంక్షలకు ముంగిపు పలుకుతున్నాయి. తాజాగా సౌదీ అరేబియా ఆంక్షల సడలింపులకు పూనుకుంది.

కరోనా ఆంక్షలను మరింతగా సడలించిన సౌదీ అరేబియా..!

ఎన్నారై డెస్క్: పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా వివిధ దేశాలు కరోనా ఆంక్షలకు ముంగిపు పలుకుతున్నాయి. తాజాగా సౌదీ అరేబియా ఆంక్షల సడలింపులకు పూనుకుంది.  భారత్, టర్కీ, ఇథియోపియా, వియత్నాం దేశాలకు వెళ్లే సౌదీ అరేబియా పౌరులపై సోమవారం నుంచి ఆంక్షలూ తొలగిపోయాయి. కరోనా సంక్షోభ పరిస్థితులను పూర్తిగా సమీక్షించాక ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ ఇటీవల ప్రకటించింది. దీంతో.. భారత్‌కు వచ్చే సౌదీ అరేబియా పౌరులపై ఉన్న ప్రత్యక్ష, పరోక్ష ఆంక్షలన్నీ తొలగిపోయినట్టైంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం 16 దేశాలకు వెళ్లంద్దంటూ సౌదీ అరేబియా గత నెల తన పౌరులను ఆదేశించింది. ఆ జాబితాలో భారత్‌ కూడా ఉంది. కానీ.. సౌదీ ప్రభుత్వం తాజాగా భారత్‌ను ఆ లిస్టు నుంచి తొలగించింది. Updated Date - 2022-06-22T02:50:16+05:30 IST