Texas సాయి నృత్య అకాడమీ ఆధ్వర్యంలో శిల్పారామంలో కూచిపుడి నృత్య ప్రదర్శన

ABN , First Publish Date - 2022-06-23T16:28:05+05:30 IST

అమెరికాలోని Texas కు చెందిన సాయి నృత్య అకాడమీ వారు హైదరాబాద్‌లోని శిల్పారామంలో ఈ నెల 25న సాయంత్రం 5.45 గంటలకు కూచిపుడి నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Texas సాయి నృత్య అకాడమీ ఆధ్వర్యంలో శిల్పారామంలో కూచిపుడి నృత్య ప్రదర్శన

హైదరాబాద్: అమెరికాలోని Texas కు చెందిన సాయి నృత్య అకాడమీ వారు హైదరాబాద్‌లోని శిల్పారామంలో ఈ నెల 25న సాయంత్రం 5.45 గంటలకు కూచిపుడి నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సాయి నృత్య అకాడమీ వారు ఈ కార్యక్రమంలో కూచిపుడి నృత్య ప్రదర్శన చేసే కళాకారుల వివరాలను వెల్లడించారు. అలాగే వారు ఏ పాటలపై ప్రదర్శన ఇవ్వనున్నారనే వివరాలను కూడా తెలిజేశారు. ఆ వివరాల ప్రకారం.. దాక్షయని బెండపూడి(బహ్మాంజలి, ఇదిగో భద్రాద్రి),  జస్మిత బొనేని(రామాయణ శబ్ధం, ముద్దుగారే యశోద), శ్రావ్య పల్లి, సంజన కల్వకొలను(అదిగో అల్లదిగో, జానుతాశబ్ధం) ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇక డాలస్, టెక్సాస్‌లో శ్రీదేవి యడ్లపాటి సాయి నృత్య అకాడమీని నెలకొల్పారు. పద్మభూషణ్ వెంపాటి చిన సత్యం, కళారత్న బాల కొండల్ రావుల ఆధ్వర్యంలో 100కు పైగా మంది విద్యార్థులు ఈ అకాడమీలో కూచిపుడిలో శిక్షణ తీసుకుంటున్నారు. వీరికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ అనుబంధంగా పని చేస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం తరఫున డిప్లామా సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నట్లు ఈ సందర్భంగా శ్రీదేవి యడ్లపాటి వెల్లడించారు. ఈ శనివారం(25వ తేదీన) శిల్పారామంలో జరిగే నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె విన్నవించారు. 



Updated Date - 2022-06-23T16:28:05+05:30 IST