బాల్కనీలో బట్టలు ఆరవేస్తే.. రూ.20వేల జరిమానా.. ఎక్కడంటే..

ABN , First Publish Date - 2022-04-27T18:01:09+05:30 IST

యూఏఈ రాజధాని అబుదాబి మున్సిపాలిటీ అధికారులు తాజాగా అక్కడి నివాసితులకు జారీ చేసిన ఓ హెచ్చరిక ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

బాల్కనీలో బట్టలు ఆరవేస్తే.. రూ.20వేల జరిమానా.. ఎక్కడంటే..

అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబి మున్సిపాలిటీ అధికారులు తాజాగా అక్కడి నివాసితులకు జారీ చేసిన ఓ హెచ్చరిక ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. బాల్కనీలో బట్టలు ఆరవేయడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే వెయ్యి దిర్హమ్స్(రూ.20వేలు) జరిమానా విధిస్తారట. అలా బాల్కనీలో బట్టలు ఆరవేయడం వల్ల సిటీ అందం దెబ్బతింటుందనేది మున్సిపల్ అధికారుల మాట. అందుకే లాండ్రీ డ్రైయింగ్ గానీ, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ వాడడం లేదా ఇతర మార్గాల ద్వారా బట్టలు ఇంట్లోనే  ఆరవేసుకోవాలని చెబుతున్నారు. ఒకవేళ తమ హెచ్చరికలను బేఖాతరు చేసి బాల్కనీలో బట్టలు ఆరవేస్తే మాత్రం రూ.20వేలు కట్టాల్సిందేనని అన్నారు. నేర తీవ్రతను బట్టి ఈ జరిమానా మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. అందుకే ఈ విషయంలో రెసిడెంట్స్ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. నగరాన్ని అందంగా, పరిశుభ్రంగా ఉంచడమనేది పౌరులు, నివాసితుల బాధ్యతగా చెప్పారు.   

Updated Date - 2022-04-27T18:01:09+05:30 IST