Viral video: కోటు వేసుకోవడానికి బైడెన్ ఆపసోపాలు.. చివరికి కళ్లజోడు కూడా..
ABN , First Publish Date - 2022-08-10T16:37:55+05:30 IST
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

కెంటుకీ: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కెంటుకీ విమానాశ్రయంలో జరిగిన ఓ అనూహ్య ఘటనకు సంబంధించినదా వీడియో. హెలికాప్టర్ నుంచి సతీమణి బిల్ బైడెన్‌తో కలిసి కిందకు దిగిన అధ్యక్షుడు.. తన జాకెట్ వేసుకునే సమయంలో పడరానిపాట్లు పడ్డారు. చివరకు భార్య సాయంతో కోటు వేసుకోవడం వీడియోలో ఉంది. ఇలా బైడెన్ కోటు ధరించడానికి పడిన ఆపసోపాల వీడియో ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. వరద బాధితులను పరామర్శించడానికి అధ్యక్షుడు బైడెన్ కెంటుకీ వెళ్లారు. అక్కడ బాధితులకు పరామర్శించారు. ఈ ప్రకృతి వైపరీత్యం కుటుంబాలను ఎలా చిద్రం చేస్తోందో తనకు తెలుసునని, ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
పర్యటన ముగించుకుని వెనుతిరుగుతున్న సమయంలో కెంటుకీ విమానాశ్రయంలో ఒక అనుహ్య ఘటన చోటు చేసుకుంది. బైడెన్ హెలికాప్టర్ దిగి వస్తూ సూట్ వేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ, ఎంతసేపటికి వేసుకోలేకపోయారు. దీంతో సహాయం కోసం సతీమణి బిల్ బైడెన్ వైపు తిరిగి, చివరి ఆమె సాయంతో వేసుకున్నారు. ఈ క్రమంలో తాను ధరించిన కూలింగ్ గ్లాస్ కిందపడడం దానిని తానే కిందకి వంగి తీసుకోవడం జరిగింది. ఇలా కోటు, కళ్లజోడు కోసం బైడెన్ పడినపాట్లన్ని వీడియోలో రికార్డయ్యాయి. ఆ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో ద్వారా బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 6.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం ఈ వీడియో మీరు కూడా ఓ లుక్కేసేయండి.