విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా..? High Risk కేటగిరీలో ఉన్న దేశాల లిస్ట్ ఇదీ..!

ABN , First Publish Date - 2022-06-30T17:58:59+05:30 IST

విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే ఒకసారి ఈ దేశాల జాబితాను పరిశీలించండి.

విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా..? High Risk కేటగిరీలో ఉన్న దేశాల లిస్ట్ ఇదీ..!

ఇంటర్నెట్ డెస్క్: విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే ఒకసారి ఈ దేశాల జాబితాను పరిశీలించండి. వీటిలో ఇంకా కరోనా ముప్పు తొలిగిపోలేదు. అందుకే వీటిని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (US CDC) హైరిస్క్ (High Risk) దేశాల జాబితాలో వేసింది. లెవెల్-3గా పేర్కొన్న ఈ దేశాల జాబితాలో తాజాగా మరో రెండు దేశాలను చేర్చింది. డామినికన్ రిపబ్లిక్ (Dominican Republic), కువైత్ (Kuwait) ఈ లిస్ట్‌లో చేరాయి. ఇంతకుముందు కువైత్ లెవెల్-1లో ఉంటే.. డామినికన్ రిపబ్లిక్ లెవెల్-2లో ఉంది. గడిచిన 28 రోజుల్లో ఏ ప్రాంతాల్లోనైతే ప్రతి లక్ష మంది నివాసితులకు గాను 100 కంటే ఎక్కువ కరోనా కొత్త కేసులు నమోదవుతాయో వాటిని హైరిస్క్ కేటగిరీ అయినటువంటి లెవెల్-3లో వేస్తారు. సీడీసీ విడుదల చేసిన హైరిస్క్ దేశాల జాబితా ప్రకారం ఈ నెల 27 వరకు మొత్తం 115 దేశాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. 


ఈ జాబితాలో ఉన్న కొన్ని ముఖ్యమైన దేశాలివే..

France, Germany, Greece, Ireland, Italy, The Netherlands, Norway, Portugal, Spain, United Kingdom, Brazil, Canada, Costa Rica, Malaysia, Mexico, South Korea, Thailand, Turkey, Dominican Republic, Kuwait తదితర దేశాలు ఉన్నాయి. ఇక సీడీసీ ప్రకారం భారత్ లెవెల్-1లో ఉంది. కాగా, లెవెల్-3 తర్వాత అత్యంత ప్రమాదకర జాబితా అయినటువంటి లెవెల్-4లో మాత్రం ప్రస్తుతం ఏ ఒక్క దేశం కూడా లేదని సీడీసీ వెల్లడించింది. అయితే, High Risk కేటగిరీ(లెవెల్-3)లో ఉన్న దేశాలకు వెళ్లకపోవడం మంచిదని ఈ సందర్భంగా సీడీసీ సూచించింది.    


Updated Date - 2022-06-30T17:58:59+05:30 IST