i-BAM ఆధ్వర్యంలో పద్య పఠనం పోటీలు

ABN , First Publish Date - 2022-07-29T02:53:49+05:30 IST

i-BAM భాగవతం ఆణిముత్యాలు ఆధ్వర్యంలో తెలుగు భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ ద్వారా జరుగుతున్న రవి కాంచిన పోతన భాగవతం పద్య పఠనపు పోటీలు - 2022 సింగపూర్‌లో జరుగుతున్నాయి

i-BAM ఆధ్వర్యంలో పద్య పఠనం పోటీలు

భాగవతం ఆణిముత్యాలు(i-BAM) ఆధ్వర్యంలో తెలుగు భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ ద్వారా జరుగుతున్న రవి కాంచిన పోతన భాగవతం పద్య పఠనపు పోటీలు - 2022 సింగపూర్‌లో జరుగుతున్నాయి. సింగపూ‌లో ఉన్న ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. పోటీలో 2 రౌండ్స్ ఉంటాయి.: 1. పోతన రౌండ్ 2. గజేంద్ర రౌండ్.  పోతన రౌండ్ సింగపూర్ ఆగస్టు 6/7 లలో జరుగుతుంది. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారు గజేంద్ర రౌండ్‌కు వెళ్తారు. పోటీ నియమ నిభందనలకు ఈ వెబ్సైట్ సంప్రదించండి: https://ibamcontests.blogspot.com/  పోటీలో పాల్గొనేందుకు ఈ ఫారం ద్వారా నమోదు చేసుకోండి : https://bit.ly/ibam-potana-sg



Updated Date - 2022-07-29T02:53:49+05:30 IST