అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం.. దుండగుడి కాల్పుల్లో 16 మందికి గాయాలు

ABN , First Publish Date - 2022-04-13T12:55:45+05:30 IST

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకుంది.

అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం.. దుండగుడి కాల్పుల్లో 16 మందికి గాయాలు

న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ స్ట్రీట్‌సబ్‌వేలో ఘటన

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 12: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. తుపాకుల వినియోగంపై నియంత్రణకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటన చేసిన మర్నాడే ఈ ఘటన జరగడం గమనార్హం. న్యూయార్క్‌ పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని బ్రూక్లిన్‌ ప్రాంతంలోని స్ట్రీట్‌సబ్‌వేలో మంగళవారం ఉదయం 8.30 సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 8 మందికి తూటా గాయాలయ్యాయని, మరో 8 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. అనుమానితుడు తొలుత పొగబాంబులు వేసి.. కాల్పులకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు

Updated Date - 2022-04-13T12:55:45+05:30 IST