లండన్ కార్యాలయంలోని ఉద్యోగులకు షాకిచ్చిన Twitter CEO.. నెట్టింట వైరల్ అవుతున్న Parag Agrawal ఫొటోలు
ABN , First Publish Date - 2022-07-04T17:01:05+05:30 IST
ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO)కు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ ఫొటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతపెద్ద సంస్థకు సీ

ఎన్నారై డెస్క్: ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO)కు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ ఫొటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతపెద్ద సంస్థకు సీఈఓగా ఉంటూ.. ఉద్యోగులతో కలివిడిగా ఉండటంపట్ల అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...
Twitter CEO Parag Agrawal.. గత వారం లండన్‌లో పర్యటించారు. అక్కడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొని.. వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఆయన షాకిచ్చారు. కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు.. సాధారణ వ్యక్తిలా కాఫీ, బిస్కెట్లు సర్వ్ చేశారు. అంతేకాకుండా కోరిన వారితో.. సెల్ఫీ దిగి వారిని ఆనందపరిచారు. కాగా.. పరాగ్ అగర్వాల్ కాఫీ సర్వ్ చేసిన ఫొటోలను సంస్థ ఉద్యోగి ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో ఉద్యోగులపట్ల ఫ్రెండ్లీగా ఉండటంపట్ల పరాగ్ అగర్వాల్‌ను అభినందిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. భారత్‌కు చందిన పరాగ్ అగర్వాల్.. 2021 నవంబర్‌లో Twitter సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేసిన పరాగ్ అగర్వాల్.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసిన విషయం తెలిసిందే.