NTR vs RAM CHARAN: తగ్గేదే లే! అంటున్న అభిమానులు.. సోషల్ మీడియాలో పోటా పోటీగా పోస్టులు

ABN , First Publish Date - 2022-03-18T02:29:24+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జక్కన చెక్కిన సినిమా ఈపాటికే విడుదల కావాల్సి ఉ

NTR vs RAM CHARAN: తగ్గేదే లే! అంటున్న అభిమానులు.. సోషల్ మీడియాలో పోటా పోటీగా పోస్టులు

ఓవర్సీస్ సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జక్కన చెక్కిన సినిమా ఈపాటికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలకు సిద్ధం అయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు హీరోల అభిమానులు కూడా అస్సలు తగ్గడం లేదు. అభిమాన నటుడిపై తమకున్న అభిమానాన్ని పోటీపడి మరీ వ్యక్త పరుస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలోని అభిమానులు పెద్ద ఎత్తులో ప్రకటనలు ఇస్తూ ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తొలుత ఎన్టీఆర్ అభిమానులు తమ కార్లను ‘ఆర్ఆర్ఆర్’ మూవీ పేరు వచ్చే విధంగా పార్క్ చేశారు. అనంతరం డ్రోన్ సహాయంతో ఆ దృశ్యాలను చిత్రీకరించి.. సోషల్ మీడియాలో వదిలారు. దీంతో రామ్ చరణ్ అభిమానులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే న్యూయార్క్‌ సిటీలోని బిల్‌బోర్డ్‌పై రామ్‌ చరణ్ యాక్షన్ సన్నివేశాలను వీడియో రూపంలో ప్రదర్శించారు. అనంతరం ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభిమానులు పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రం.. ఇరు హీరోల అభిమానులు పెట్టే పోస్టులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Updated Date - 2022-03-18T02:29:24+05:30 IST