‘రాధేశ్యామ్’ ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2022-03-08T01:14:16+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్షిప్ పూర్తైంది. సెన్సార్ స

‘రాధేశ్యామ్’ ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

ఓవర్సీస్ సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్షిప్ పూర్తైంది. సెన్సార్ సభ్యులు  ‘రాధేశ్యామ్’కు యూ/ఏ సర్టిఫిట్‌ను ఇచ్చారు. అయితే సినిమా విడుదలకు ముందే మొదటి రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు.. సెన్సార్ కార్యక్రమంలో భాగంగా ‘రాధేశ్యామ్’ను వీక్షించి ఆయన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశాడు. ‘అసలు సిసలైన సినిమా ‘రాధేశ్యామ్’. ముఖ్యంగా ముఖ్యంగా క్లైమాక్స్ సరికొత్తగా ఉంది. సినిమా మొత్తానికది ప్రత్యేకంగా నిలిచిపోతుంది. గ్రాఫిక్స్ ను ఉపయోగించుకున్న విధానం అమోఘం. ప్రభాస్, పూజా కెమిస్ట్రీకి ఒంట్లో కరెంట్ ప్రవహిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎవరూ తీయని మిస్టరీ సబ్జెక్ట్ తో ‘రాధేశ్యామ్’ తెరకెక్కించారు. క్లాస్ అండ్ స్టైల్ లో ప్రభాస్ ను కొట్టే మొనగాడు ఇండియాలో మరెవరూ లేరు. ఈ సినిమాలో ఆయన అత్యంత ఆకర్షణీయంగా కనిపించారు. అతడి నటన, ఆహార్యం నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి’ అంటూ ఉమైర్ సంధు ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని ఆకాశానికెత్తేశారు. అయితే.. సినిమా ఎలా ఉందనే విషయం తెలియాలంటే సగటు ప్రేక్షకుడు ఈ నెల 11 వరకు వేచి చూడాల్సిందే. 
Updated Date - 2022-03-08T01:14:16+05:30 IST