Americaలో దుమ్ములేపుతున్న సౌత్ ఇండియా సినిమాలు!

ABN , First Publish Date - 2022-06-06T20:51:30+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా విడుదలైన రెండు దక్షిణాది సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. ఒకే రోజు విడుదలైన ఆ రెండు సినిమాలు.. మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుని.. మూడు రోజుల్లోనే పెద్దమొత్తాన్నే కొల్లగొట్టాయి. కాగా.. అమెరికాలో ప్రేక్షకులను థియేటర్ల ముందు క్యూ కట్టిస్తున్న ఆ సౌత్ ఇండియా సినిమా

Americaలో దుమ్ములేపుతున్న సౌత్ ఇండియా సినిమాలు!

ఓవర్సీస్ సినిమా: అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా విడుదలైన రెండు దక్షిణాది సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి.  ఒకే రోజు విడుదలైన ఆ రెండు సినిమాలు.. మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుని.. మూడు రోజుల్లోనే పెద్దమొత్తాన్నే కొల్లగొట్టాయి. కాగా.. అమెరికాలో ప్రేక్షకులను థియేటర్ల ముందు క్యూ కట్టిస్తున్న ఆ సౌత్ ఇండియా సినిమాలు ఏవి? ఇప్పటి వరకు అవి ఎంత మొత్తం వసూలు చేశాయి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతోపాటు తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. హీరో సూర్య.. గెస్ట్‌ రోల్ చేశారు. ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ మూవీ ఆదివారం ఒక్కరోజే అమెరికాలో 3,40,000డాలర్లు వసలూ చేసి ఔరా అనిపించింది. దీంతో ఇప్పటి వరకు ఆమెరికాలో ఈ సినిమా 1.74మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.13.5కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 


ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘మేజర్’ సినిమా సగటు సినీ ప్రేక్షుకుడి మనసు దోచుకుంది. అడివి శేష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా.. అమెరికాలో ఆదివారం ఒక్క రోజే 1,35,000 డాలర్లు వసూలు చేసింది. దీంతో ‘మేజర్’ సినిమా అమెరికాలో ఇప్పటి వరకూ వసూలు చేసిన మొత్తం 8,60,000డాలర్లకు అంటే.. రూ.6.67 కోట్లకు చేరింది. 


Read more