Vijay Devarakonda: అభిమానులకు నిజంగా ఇది పండగలాంటి వార్తే.. అమెరికాలో ‘లైగర్’ ఇప్పటికే ఎంత వసూలు చేసిందంటే..

ABN , First Publish Date - 2022-08-25T01:34:15+05:30 IST

అర్జున్ రెడ్డి, గీతా గోవిందం మూవీల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదైన గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ.. ‘వాట్సప్ వాట్సప్ రౌడీ బాయ్స్’ అంటూ యూత్‌కు దగ్గరయ్యాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘లై

Vijay Devarakonda: అభిమానులకు నిజంగా ఇది పండగలాంటి వార్తే.. అమెరికాలో ‘లైగర్’ ఇప్పటికే ఎంత వసూలు చేసిందంటే..

ఓవర్సీస్ సినిమా: అర్జున్ రెడ్డి, గీతా గోవిందం మూవీల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదైన గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ.. ‘వాట్సప్ వాట్సప్ రౌడీ బాయ్స్’ అంటూ యూత్‌కు దగ్గరయ్యాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘లైగర్’ మూవీ భారత్ సహా ఇతర ప్రపంచ దేశాల్లో మరికొద్ది గంటల్లో (ఆగస్ట్ 25న) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు.. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. ‘లైగర్’ను విజయ్ దేవరకొండ.. తన భుజాల మీద వేసుకుని నడిపించాడని.. వన్ మ్యాన్ షోగా సినిమా సాగుతుందని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. టెర్రిఫిక్ యాక్షన్ స్టంట్స్‌తో... డైరెక్షన్ అదిరిపోయిందంటూ మూవీపై ప్రశంసలు కురిపించాడు. కథ, స్క్రీన్ ప్లే రోటీన్ గా ఉన్నా..  విజయ్ తన నటనతో విజిల్స్ వేయిస్తాడని చెప్పుకొచ్చారు. 



ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..

ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటికొచ్చింది. అగ్రరాజ్యం అమెరికాలో 165 లొకేషన్లలో ఈ సినిమా విడుదల అవుతుండగా.. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పడిపోయాయి. ఈ క్రమంలో ‘లైగర్’ మూవీ ఎర్లీ మార్నింగ్ హవర్స్ గ్రాస్ రూపంలో ఇప్పటికే 2లక్షల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.1.60కోట్లు) కొల్లగొట్టేసింది. ఈ విషయాన్ని ‘లైగర్’ను ఓవర్సీస్‌లో విడుదల చేసిన సరిగమా సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. సినిమా ఇదే ఊపుతో దూసుకుపోతే.. కచ్చితంగా రికార్డులు బద్దలవడం ఖాయం. 


Read more