USA Box Office: బింబిసార, సీతారామం కలెక్షన్ల సునామీ.. సోమవారం నాటికి ఏ సినిమా ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే..

ABN , First Publish Date - 2022-08-10T23:44:09+05:30 IST

బింబిసార(Bimbisara), సీతారామం(Sitaramam).. ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లోని సినీ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. రొట్ట రొటీన్ కథలతో వచ్చిన సినిమాలు చూసి.. ప్రేక్షకులు థియేటర్లకు రావటమే మానేస్తున్న

USA Box Office: బింబిసార, సీతారామం కలెక్షన్ల సునామీ.. సోమవారం నాటికి ఏ సినిమా ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే..

ఓవర్సీస్ సినిమా: బింబిసార(Bimbisara), సీతారామం(Sitaramam).. ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లోని సినీ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. రొట్ట రొటీన్ కథలతో వచ్చిన సినిమాలు చూసి.. ప్రేక్షకులు థియేటర్లకు రావటమే మానేస్తున్న తరుణంలో రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు సినీ అభిమానులతో శభాష్ అనిపించుకున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అగ్రరాజ్యం అమెరికాలో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. 


నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరోగా.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కిన ‘బింబిసార’ అమెరికాలోని సినీ ప్రేక్షకులతో కూడా జయహో అనిపించుకుంటోంది. తొలుత ఈ సినిమా అక్కడ 175లొకేషన్లలో రిలీజ్ అయినప్పటికీ.. సోమవారం నాటికి 155లొకేషన్లలో ప్లే అవుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఒక్క రోజే యూఎస్‌లో 33,922 డాలర్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా 3,72,576 డాలర్లు(సుమారు రూ.2.95కోట్లు) రాబట్టి బక్సాఫీస్(USA Box Office) వద్ద దూసుకుపోతోంది. 



ఇదే సమయంలో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా.. బాలీవుడ్ ముద్దగుమ్మ మృణాల్ ఠాగూర్ హీరోయిన్‌గా క్లాసికల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ‘సీతారామం’ ప్రేక్షకులను కట్టిపడేసింది.  హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా సోమవారం యూఎస్‌లో 71,404 డాలర్లు వసూలు చేసింది. ఈ మొత్తంతో కలిసి ఆ సినిమా వసూళ్లు 6,69,770 డాలర్లకు(సుమారు రూ.5.30కోట్లు) చేరాయి. ‘సీతారామం’ అమెరికాలో తొలుత 284 లొకేషన్లలో విడుదలైనా.. ప్రస్తుతం 272 లొకేషన్లలో ప్లే అవుతోంది. 




Updated Date - 2022-08-10T23:44:09+05:30 IST