అమెరికాలో ‘భీమ్లా నాయక్’‌ హవా.. పవన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు!

ABN , First Publish Date - 2022-03-02T18:59:42+05:30 IST

పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ కథనాయకుడిగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రానా దగ్గుపాటి కీలక పాత్రలో నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో‌ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

అమెరికాలో ‘భీమ్లా నాయక్’‌ హవా.. పవన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు!

ఓవర్సీస్ సినిమా: పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ కథనాయకుడిగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రానా దగ్గుపాటి కీలక పాత్రలో నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో‌ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.100కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. అటు యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా భీమ్లా హవా కొనసాగుతోంది. అమెరికాలో తొలి వీకెండ్‌లోనే 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.15కోట్లు) రాబట్టింది. మంగళవారం నాటికి ఈ మూవీ యూఎస్‌లో 2.23మిలియన్లకు(గ్రాస్) పైగా వసూలు చేయడం విశేషం. దీంతో పవన్ కెరీర్‌లోనే అమెరికాలో ‘భీమ్లా నాయక్’‌ అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ మేరకు అక్కడ ‘భీమ్లా నాయక్’‌ను విడుదల చేసిన ప్రైమ్ మీడియా ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అజ్ఞాతవాసి' పేరున ఉంది. 2018లో విడుదలైన ఈ మూవీ అగ్రరాజ్యంలో మొత్తం రన్‌టైంలో 2.06 మిలియన్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇప్పుడు 'భీమ్లా నాయక్' దాన్ని దాటేసింది. దీంతో యూఎస్‌లో పవన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది.


ఇక 'భీమ్లా నాయక్' సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైనర్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'భీమ్లా నాయక్' చిత్రానికి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. దీంతో ఈ చిత్రం పలు రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2022-03-02T18:59:42+05:30 IST