ఆడవాళ్లు మీకు జోహార్లు: శర్వానంద్ కెరీర్‌లోనే తొలిసారిగా అమెరికాలో..

ABN , First Publish Date - 2022-03-04T02:54:21+05:30 IST

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ట్రైలర్‌ను కొద్ది రోజుల క్రితం చిత్ర యూనిట్ యూట్యూబ్‌

ఆడవాళ్లు మీకు జోహార్లు: శర్వానంద్ కెరీర్‌లోనే తొలిసారిగా అమెరికాలో..

ఓవర్సీస్ సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ట్రైలర్‌ను కొద్ది రోజుల క్రితం చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి సినీ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందకు రాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అగ్రరాజ్యం అమెరికాలో ఈ సినిమా ఏకంగా 315 థియేటర్లలో విడుదల కాబోతోంది.


యూఎస్‌లో శర్వానంద్ సినిమా.. రికార్డు స్థాయిలో ఇన్ని థియేటర్లలో రిలీజ్ కావడం ఇదే తొలిసారి. గతంలో శర్వానంద్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా ఇన్ని థియేటర్లలో విడుదల కాలేదు. ఇకపోతే ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ హీరోయిన్స్ ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. తొలుత ఈ మూవీని ఫిబ్రవరి 24నే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే ‘భీమ్లా నాయక్’ సినిమా కారణంగా విడుదలను చిత్ర యూనిట్ వాయిదా వేసింది.Updated Date - 2022-03-04T02:54:21+05:30 IST