అమెరికాలో మే 28న NTR శతజయంతి వేడుకలు
ABN , First Publish Date - 2022-05-18T18:02:18+05:30 IST
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ యుగ పురుషుడు పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలని మే 28న అమెరికాలోని వర్జీనియా రాష్ట్రము స్టెర్లింగ్ నగరంలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు NTR ఫ్యాన్స్ యూఎస్ఏ ప్రతినిధి ఉయ్యూరు శ్రీనివాస్ తెలిపారు.

USA ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహణ
ఇంటర్నెట్ డెస్క్: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ యుగ పురుషుడు పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలని మే 28న అమెరికాలోని వర్జీనియా రాష్ట్రము స్టెర్లింగ్ నగరంలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు NTR ఫ్యాన్స్ యూఎస్ఏ ప్రతినిధి ఉయ్యూరు శ్రీనివాస్ తెలిపారు. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన అన్నగారి శతజయంతి వేడుకలని ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతి శుక్ర, శని, ఆదివారాలలో వర్జీనియాలో ఎన్టీఆర్ చిత్ర ప్రదర్శనల ద్వారా ఏడాది పొడవునా శతజయంతి వేడుకలని నిర్వహించేందుకు తగిన సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని, ఉనికిని చాటి చెప్పిన అన్న నందమూరి తారక రామరావు శతజయంతి వేడుకులు జరుపుకుని ఆ మహానుభావుడిని స్మరించుకోవడం ప్రతి తెలుగు వాడి బాధ్యతగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఎదురు చూస్తున్నాం అని పలువురు ప్రవాస భారతీయులు తెలిపారు.


