బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు!
ABN , First Publish Date - 2022-05-30T03:24:06+05:30 IST
దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని దశ దిశలా చాటిన తెలుగు తేజం.. ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఎన్నారైలు ఘనంగా నిర్వహించుకున్నారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని దశ దిశలా చాటిన తెలుగు తేజం.. ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఎన్నారైలు ఘనంగా నిర్వహించుకున్నారు. సినీ రంగంలో తనదైన శైలిలో ఆ చంద్రతారార్కం నిలిచే కీర్తిని సొంతం చేసుకున్న అన్నగారు ఆ తర్వాత కాలంలో టీడీపీని స్థాపించి.. తెలుగు వారి కీర్తిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయనకు సాటి రాగల నాయకుడు, నటుడు, ఈ నేలపై లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇక, తెలుగు వారు ఎక్కడ ఉన్నా పార్టీలు, కులమతాలు, భాషలకు అతీతంగా అన్నగారిని అభిమానిస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు నేల నుంచి వెళ్లి అగ్రరాజ్యంలో స్థిరపడిన ఎన్నారైలు కూడా అన్నగారి పట్ల అంతే భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అన్నగారి జయంతిని పురస్కరించుకుని మే 28న కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.

భక్త భల్లా వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమాన్ని నడిపించి తన ట్రేడ్ మార్క్ పంచులతో అన్నగారి మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రజనీకాంత్ కాకర్ల తనదైన శైలిలో ప్రసంగించారు. ప్రకాశం జిల్లా వాసి వెంకట్ అడుసుమిల్లి తన సొంత గ్రామంలో ఒంగోలు మహానాడు జరగడం పట్ల హర్షం ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో అన్నగారి మేలు మలుపులను విజయకృష్ణ గుమ్మడి, కృష్ణ గొంపా తదితరులు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ దొడ్డపనేని, భక్త భల్లా, రజనీకాంత్ కాకర్ల, విజయకృష్ణ గుమ్మడి, క్రిష్ణ గొంపా, కళ్యాణ్ వీరపనేని, వెంకట్ అడుసుమిల్లి, గాంధి పాపినేని, భరత్ ముప్పిరాళ్ల, భాస్కర్ మొలకలపల్లి, భాస్కర్ వల్లభనేని, అజయ్, లక్ష్మణ్ పరుచూరి, సతీష్ బోళ్ల, సందీప్ ఇంటూరి, లియోన్ బోయపాటి, సుధీర్ ఉన్నం, శ్రీనివాస్ తడపనేని, శ్రీధర్ రావుల, కళ్యాణ్, తిరుపతి రావు, సాయి యనమదల, రవి ఆలపాటి, వర్మ, భరణి, సత్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు, తెలుగు వారు హాజరై అన్నగారు ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు.
