NRIపై అభినందనల వెల్లువ.. ఇంతకూ ఆయన ఏం చేశారంటే..
ABN , First Publish Date - 2022-03-07T00:00:00+05:30 IST
కేరళకు చెందిన ఎన్నారైపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన చేస్తున్న మంచి పనిని అభినందిస్తున్నారు. భవిష్యత్తులో మరికొంత మందికి సహాయం చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన స్పం

ఎన్నారై డెస్క్: కేరళకు చెందిన ఎన్నారైపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన చేస్తున్న మంచి పనిని అభినందిస్తున్నారు. భవిష్యత్తులో మరికొంత మందికి సహాయం చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. కేరళలో మరో ఇన్‌స్టిట్యూట్‌ను త్వరలో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఇంతకూ ఎవరా ఎన్నారై? ఆయన చేస్తున్న కార్యక్రామాలు ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళకు చెందిన బిజు కున్నుంపురతు అనే వ్యక్తి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వత మలేషియా వెళ్లి.. అటునుంచి అటే బిజినెస్ ప్రారంభించేందుకు మెల్‌బోర్న్ వెళ్లాడు. అక్కడ ఆయనకు మంచి అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో అక్కడి ఓ ఆసుపత్రిలోని రిక్రూట్‌మెంట్ సెక్టార్‌లో పని చేసే అవకాశం వచ్చింది. సరిగ్గా అపుడే.. భారత్‌కు చెందిన నర్సులకు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నట్టు ఆయన గుర్తించారు. వెంటనే కొచ్చిలో రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించాడు. ఇండియాలోని నర్సులు స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు చేరుకునే ఏర్పాట్లు చేసి, ఆ తర్వాత వారికి మెల్‌బోర్న్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లో నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నాడు. దీంతో ఆస్ట్రేలియాలోని ఆసుపత్రిల్లో జాబ్ పొందేందుకు వారికి మార్గం సుగమం అవుతోంది. నైపుణ్య శిక్షణ తీసుకున్న భారత నర్సులు.. అక్కడి టెస్టుల్లో క్వాలిఫై కావడంతో జాబ్‌లు పొందుతున్నారు. భారత నర్సులతోపాటు నేపాల్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన సుమారు 20వేల మందికి ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెల్‌బోర్న్ తరహాలోనే కేరళలోని కడవంతరలో కూడా ఈ ఏడాది ఓ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఆర్థికంగా వెనకబడి వాళ్లు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు స్కాలర్‌షిప్‌లను కూడా ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడించారు.