లక్కంటే.. ఈ 26ఏళ్ల కుర్రాడిదే.. పెళ్లైన మరుసటి రోజే ఆ శుభవార్త!

ABN , First Publish Date - 2022-07-16T15:47:35+05:30 IST

ఉద్యోగం అతడు నాలుగేళ్ల క్రితం దుబాయ్ వచ్చాడు. అనంతరం జిమ్ మేనేజర్‌గా పని చేస్తూ.. ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. తన ప్రేమను ఆమె ముందు వ్యక్త పరిచాడు. ఆమె కూడా పచ్చజెండా ఉపడంతో ఇద్దరి లవ్‌స్టోరీ మొదలైంది. కొన్నాళ్లపాటు ప్రేమా

లక్కంటే.. ఈ 26ఏళ్ల కుర్రాడిదే.. పెళ్లైన మరుసటి రోజే ఆ శుభవార్త!

ఎన్నారై డెస్క్: ఉద్యోగం అతడు నాలుగేళ్ల క్రితం దుబాయ్ వచ్చాడు. అనంతరం జిమ్ మేనేజర్‌గా పని చేస్తూ.. ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. తన ప్రేమను ఆమె ముందు వ్యక్త పరిచాడు. ఆమె కూడా పచ్చజెండా ఉపడంతో ఇద్దరి లవ్‌స్టోరీ మొదలైంది. కొన్నాళ్లపాటు ప్రేమాయణం సాగించి.. తాజాగా పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లైన మరుసటి రోజే ఆ యువకుడిని అదృష్టం వరించింది. విషయం తన భార్యకు కూడా తెలియడంతో ఆమె కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి. ఇంతకూ విషయం ఏంటంటే...


లండన్‌కు చెందిన రీస్ (Reece).. 22ఏళ్ల వయసులో స్వదేశాన్ని వీడాడు. ఉపాధి కోసం ఎడాది దేశం బాటపట్టి, దుబాయ్‌లో జిమ్ మ్యానేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ అమ్మాయిని చూసి అతడు మనసు పారేసుకున్నాడు. ప్రేమ విషయాన్ని చెప్పి, ఆమె మనసు గెలిచాడు. ప్రస్తుతం అతడికి 26ఏళ్లు కాగా.. తాజాగా ప్రేమించిన యువతిని పెళ్లాడాడు. ఊహించని విధంగా వివాహం జరిగిన మరుసటి రోజే అతడిని అదృష్టం వరించింది. రెండేళ్ల తర్వాత అతడి కల నిజమైంది. Mahzooz లక్కీ డ్రాలో అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. Mahzooz గ్రాండ్ ప్రైజ్ ఈవెంట్‌లో ఏకంగా 10 మిలియన్ దిర్హమ్‌లు (భారత కరెన్సీలో సుమారు రూ.21.7కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఇది తనకు బెస్ట్ మ్యారేజ్ గిఫ్ట్ అని పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో తాను విజేత అని గుర్తించి క్షణంపాటు ఫ్రీజ్ అయిపోయానన్నాడు. అనంతరం విషయాన్ని తన చెప్పినట్టు పేర్కొన్నాడు. దీంతో ఆనందంతో ఆమె కళ్లు చెమ్మగిల్లాయని వెల్లడించాడు. తాను గెలిచిన డబ్బును ఫ్యూచర్ కోసం సేవింగ్స్ చేస్తానని చెప్పాడు.


Read more