ఇక ఆపు.. నాకసలే సిగ్గెక్కువ ... Elon Musk మరో ట్వీట్ Viral

ABN , First Publish Date - 2022-05-01T23:12:43+05:30 IST

పబ్లిసిటీ, పాపులారిటీ సాధించడం, దాన్ని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఈ విద్యలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon musk) రాటుదేలిపోయారని ఆయన్ను చూస్తున్నవారెవరైనా కచ్చితంగా చెబుతారు.

ఇక ఆపు.. నాకసలే సిగ్గెక్కువ ...  Elon Musk మరో ట్వీట్ Viral

ఎన్నారై డెస్క్: పబ్లిసిటీ, పాపులారిటీ సాధించడం, వాటిని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఈ విద్యలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon musk) రాటుదేలిపోయారని ఆయన్ను చూస్తున్నవారెవరైనా కచ్చితంగా చెబుతారు. ఆయన ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. ప్రపంచమంతా రోజుల తరబడి దాని గురించే చర్చిస్తుంది. ఇటీవలే మస్క్ ట్విటర్‌ను చేజిక్కించుకుని ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే మస్క్ చేసిన తాజా ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘‘ఇక ఆపు.. నాకు అసలే సిగ్గెక్కువ’’ అంటూ ఆయన కామెంట్ చేయడమే ఇందుకు కారణం. అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు అలెక్జాండ్రియా ఒకేసియా-కార్టెజ్‌ను ఉద్దేశిస్తూ ఆయన ఇలా పంచ్ ఇచ్చారు.  


అంతకుమునుపు.. సోషల్ మీడియా గురించి అలెక్జాండ్రియా ఓ ట్వీట్ చేశారు. ‘‘దురభిమానం బాగా ఉన్న ఓ బిలియనీర్.. ఓ పెద్ద కమ్యూనికేషన్ వేదికను పూర్తిస్థాయిలో తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దీంతో.. విద్వేషపూరిత వ్యాఖ్యలు అడ్డూఆపూ లేకుండా పెరిగిపోవచ్చనే ఆలోచనతో నాకు స్ట్రేస్ ఎక్కువవుతోంది’’ అని ఆమె ట్వీట్ చేశారు. దీనికి వెంటనే రిప్లై ఇచ్చిన మస్క్.. ‘‘నాకు లైనేయడం ఆపు.. నాకసలే సిగ్గెక్కువ’’ అంటూ తుంటరి ట్వీట్ చేశారు. అయితే..అలెక్జాండ్రియా కూడా అదే స్థాయిలో రిటార్ట్ ఇచ్చారు. ‘‘నేను మాట్లాడింది మార్క్ జకర్‌బర్గ్ గురించి..’’ అంటూ మస్క్‌ స్పీడుకు బ్రేకులు వేశారు. ప్రస్తుతం ఈ సంవాదం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ట్విటర్ మస్క్ చేతుల్లోకి వెళ్లడంతో ప్రపంచవ్యాప్తంగా మితవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ట్విటర్‌లో భావప్రకటనా స్వేచ్ఛకు ఎటువంటి అడ్డంకులూ లేకుండా చేస్తానంటున్న మస్క్.. అరాచకానికి తెరలేపుతాడంటూ కొందరు భయపడుతున్నారు. 

Updated Date - 2022-05-01T23:12:43+05:30 IST