‘Kaali’ poster row: భగ్గుమంటున్న హిందూ సంఘాలు.. ‘తగ్గేదే లే’ అంటున్న దర్శకురాలు
ABN , First Publish Date - 2022-07-05T20:47:01+05:30 IST
లీనా మణిమెకలై డైరెక్ట్ చేసిన ‘కాళీ’ డాక్యుమెంటరీ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. కాళీ మాత సిగరెట్ కాల్చుతున్నట్టు కనిపించే పోస్టర్ విడుదల చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చే
ఎన్నారై డెస్క్: లీనా మణిమెకలై డైరెక్ట్ చేసిన ‘కాళీ’ డాక్యుమెంటరీ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. కాళీ మాత సిగరెట్ కాల్చుతున్నట్టు కనిపించే పోస్టర్ విడుదల చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా దర్శకురాలిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. ఫిల్మ్ ప్రమోషన్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు అంటూ హితవు పలుకుతున్నాయి. ఈ క్రమంలో కెనడాలోని హిందూ కమ్యూనిటీల సభ్యులు అక్కడి ఇండియన్ హైకమిషన్‌ను ఆశ్రయించి.. ‘కాళీ’ పోస్టర్‌పై ఫిర్యాదు చేశాయి. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు.. అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నాయి. దీంతో ఇండియన్ హైకమిషన్ కూడా స్పందించింది. విషయాన్ని కెనడా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ‘కాళీ’ డాక్యుమెంటరీలో హిందూ మనోభావాలు కించ పరిచే విధంగా ఉన్న దృశ్యాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
కాగా.. ఫిల్మ్ఫెస్ట్లో భాగంగా టొరెంటోలోని అఘా ఖాన్ మ్యూజియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ హైకమిషన్ హిందూ సంఘాల అభ్యంతరాలను ఈవెంట్ నిర్వాహకుల దృష్టికి సైతం తీసుకెళ్లింది. కెనడా అధికారులకు విషయాన్ని వివరించినట్టు తెలపడంతోపాటు.. హిందూ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్న దృశ్యాలను తొలగించాలని పేర్కొంది. ఇదిలా ఉంటే.. లీనా మణిమెకలైకి వ్యతిరేకంగా మన దేశంలో కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఎన్నారై డైరెక్టర్‌ను అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లో కూడా దర్శకురాలిపై ఐపీసీ 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే.. లీనా మణిమెకలై మాత్రం.. అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ‘కాళీ’ మాత సిగరెట్ తాగడం, చేతిలో ఎల్టీబీటీలకు సంబంధించిన జెండాను పట్టుకున్నట్టుగా పోస్టర్లు రిలీజ్ చేయడాన్ని సమర్థించుకుంది.