విదేశీ టీచర్లకు కువైత్ గుడ్న్యూస్.. 1000 ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం!
ABN , First Publish Date - 2022-03-20T13:50:23+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్ విదేశీ టీచర్లకు గుడ్న్యూస్ చెప్పింది.

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ విదేశీ టీచర్లకు గుడ్న్యూస్ చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరానికి గాను 1000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. 11 వేర్వేరు సబ్జెక్టుల బోధన కోసం వెయ్యి మంది విదేశీ టీచర్లు అవసరం ఉన్నట్లు ఈ సందర్భంగా ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే స్త్రీ, పురుష అభ్యర్థులకు వేర్వేరు రిక్వైర్మెంట్స్ను సూచించింది. ఇంగ్లీష్, ఫ్రెంచ్, గణితం, సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, జియాలజీ, ఫిలాసఫీ, డెకరేషన్ సబ్జెక్టులు బోధించేందుకు పురుష అభ్యర్థులు అవసరమని పేర్కొంది. అలాగే సంగీతం, భౌతికశాస్త్రం, గణితం, ఆంగ్లం బోధించేందుకు మహిళా ఉపాధ్యాయులు అవసరమని తెలియజేసింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను మంత్రిత్వ శాఖ వెబ్సైట్లోని ప్రత్యేక లింక్ ద్వారా సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇప్పటికే విదేశీ టీచర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని మంత్రిత్వశాఖ పేర్కొంది.