Netflix content: నెట్‌ఫ్లిక్స్‌పై గల్ఫ్ దేశాల వార్‌కు కువైత్ మద్దతు

ABN , First Publish Date - 2022-09-08T14:56:13+05:30 IST

గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సభ్య దేశాలు యూఎస్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) కంటెంట్‌పై చేస్తున్న వార్‌కు కువైత్ మద్దతు తెలిపింది.

Netflix content: నెట్‌ఫ్లిక్స్‌పై గల్ఫ్ దేశాల వార్‌కు కువైత్ మద్దతు

కువైత్ సిటీ: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సభ్య దేశాలు యూఎస్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) కంటెంట్‌పై చేస్తున్న వార్‌కు కువైత్ మద్దతు తెలిపింది. గత కొంతకాలంగా జీసీసీ దేశాలు నెట్‌ఫ్లిక్స్‌లోని ఆక్షేపణీయమైన, ఇస్లామిక్ సామాజిక విలువలకు అవమానకరంగా భావించే కంటెంట్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. దీనికి తాము మద్దతు ఇస్తున్నట్లు రెండు కువైత్ (Kuwait) రాష్ట్ర సంస్థలు బుధవారం ప్రకటించాయి. ఈ మేరకు సమాచార మంత్రిత్వశాఖ, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. "గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అభ్యర్థనకు నెట్‌ఫ్లిక్స్ ఎంతవరకు కట్టుబడి ఉంటుందో కువైత్ నిశితంగా పర్యవేక్షిస్తుంది. అనుచితమైనదిగా కనిపించే ఏదైనా కంటెంట్ ఖచ్చితంగా నిషేధించబడుతుంది, గల్ఫ్ అరబ్ దేశాల డిమాండ్‌ను నెరవేర్చకపోతే నెట్‌ఫ్లిక్స్ చట్టపరమైన చర్యలను ఎదుర్కొక తప్పదు" అని తమ ప్రకటన ద్వారా హెచ్చరించాయి. 

Updated Date - 2022-09-08T14:56:13+05:30 IST