ఆ ఒక్క పనితో రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన NRI!

ABN , First Publish Date - 2022-07-11T14:00:14+05:30 IST

నిత్యం ఎంతో మంది ఉపాధి కోసం ఇతర దేశాలకు వలస వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో అతడు కూడా ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం స్వదేశం వీడాడు. ఉద్యోగం చేస్తూ.. నెల నెలా వచ్చే జీతం డబ్బులతో ఇన్నా

ఆ ఒక్క పనితో రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన NRI!

ఎన్నారై డెస్క్: నిత్యం ఎంతో మంది ఉపాధి కోసం ఇతర దేశాలకు వలస వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో అతడు కూడా ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం స్వదేశం వీడాడు. ఉద్యోగం చేస్తూ.. నెల నెలా వచ్చే జీతం డబ్బులతో ఇన్నాళ్లు నెట్టుకొస్తున్న అతడిని తాజాగా అదృష్టం వరించింది. ఒకే ఒక్క పనితో రాత్రికి రాత్రే కోటీశ్వరడుయ్యాడు. కాగా.. అతడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన అనీష్ అర్జునన్.. ఇండియాలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం మంచి ఉద్యోగం కోసం ఎడారి దేశం బాటపట్టారు. ఫ్లైట్ ఎక్కి యూఏఈ వెళ్లిపోయారు. అజ్మన్‌లోని ఓ సంస్థలో ఐటీ ఇంజినీర్‌గా పని చేస్తూ వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. తాజాగా అదృష్టం ఆయన తలుపు తట్టింది. ఆయన కొనుగోలు చేసిన లాటరీ టికెట్టు‌కు Mahzooz Draw‌లో జాక్ పాట్ తగలడంతో ఏకంగా 10 మిలియన్ దిర్హమ్‌లు (సుమారు రూ.21కోట్లు) గెలుచుకున్నారు. ఈ విషయాన్ని తొలుత నమ్మలేకపోయిన ఆయన.. తర్వాత ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘గెలుచుకున్న డబ్బులతో మొదట అప్పులు తీర్చేస్తా. నా ఫ్యామిలీని యూఏఈకి తీసుకొస్తా’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. Mahzooz Draw ద్వారా మిలియనీర్‌గా మారిన 24వ వ్యక్తిగా అనీష్ అర్జునన్ గుర్తింపు పొందారు. 


Read more