లక్ అంటే ఇది! యూఏఈలోని భారతీయుడికి బంపర్ ఆఫర్..!

ABN , First Publish Date - 2022-03-06T02:34:52+05:30 IST

అదృష్టం ఎప్పుడో గానీ తలుపు తట్టదు.. అందుకే మనుషులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.. అందిన అవకాశాన్ని వెను వెంటనే అందిపుచ్చుకోవాలి. కానీ.. యూఏఈలో ఉంటున్న ఓ భారతీయుడికి ఏకంగా రెండు సార్లు కాలం కలిసి వచ్చింది.

లక్ అంటే ఇది! యూఏఈలోని భారతీయుడికి బంపర్ ఆఫర్..!

ఎన్నారై డెస్క్: అదృష్టం ఎప్పుడో గానీ తలుపు తట్టదన్న విషయం తెలిసిందే. కొందరు కలిసి రావడం కోసం జీవత కాలం పాటు వేచి చూస్తారు. కానీ.. యూఏఈలో ఉంటున్న ఓ భారతీయుడికి ఏకంగా రెండు సార్లు అదృష్టం తలుపు తట్టింది. ఒకసారి లాటరీ తగలడమే గగనమనుకుంటే.. అతడు 24 ఏళ్ల గ్యాప్‌లో రెండు మార్లు లాటరీలు గెలుచుకున్నాడు. అలా అదృష్టం వెంటాడిన ఆ వ్యక్తి పేరు సైదలీ కన్నన్. కేరళకు చెందిన ఆయన గత కొన్నేళ్లుగా అబుదాబీలో షెఫ్‌గా పనిచేస్తున్నారు. 


1998లో ఆయన తొలిసారిగా లాటరీ కొట్టారు. అప్పట్లో కొంత మొత్తం గెలుచుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన లాటరీ టిక్కెట్లు కొంటూనే ఉన్నారు. దాని ఫలితంగా మరోసారి ఆయన్ను అదృష్టం వరించింది. ఇటీవల జరిగిన బిగ్ టిక్కెట్ డ్రాలో ఆయన ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నారు. తన స్నేహితుడు అబ్దుల్ మాజిద్‌తో  కలిసి కన్నన్ ఈ టిక్కెట్టు కొనడంతో..అతడికీ కాలం కలిసొచ్చింది. ‘‘గత 20 ఏళ్లుగా సైదలీతో కలిసి టిక్కెట్లు కొంటున్నాను. అతడు చాలా లక్కీ అని నాకు తెలుసు. ఎట్టకేలకు మాకు టైం కలిసొచ్చింది’’  అని అబ్దుల్ మాజిద్ చెప్పుకొచ్చాడు.

Read more