Joe biden: కరోనా పరీక్షలో బైడెన్‌కు నెగెటివ్! ఐసోలేష్‌కు ముగింపు

ABN , First Publish Date - 2022-08-08T03:42:17+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe biden) ఐసోలేషన్ ఆదివారం ముగిసింది. ఆదివారం నాడు జరిపిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా తేలింది.

Joe biden: కరోనా పరీక్షలో బైడెన్‌కు నెగెటివ్! ఐసోలేష్‌కు ముగింపు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe biden) ఐసోలేషన్ ఆదివారం ముగిసింది. ఆదివారం నాడు జరిపిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా తేలింది. అంతకుముందు రోజు కూడా కరోనా నెగెటివ్ రావడంతో బైడెన్ తన ఐసోలేషన్‌ను ముగించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు అందరికీ దూరంగా ఉండటాన్ని ఐసోలేషన్ అంటారన్న విషయం తెలిసిందే. వ్యాధి ఇతరులకు సోకకుండా ఉండేందుకు వైద్యులు కరోనా బాధితులిని ఐసోలేషన్‌లో ఉండమని సూచిస్తారు. నాకంతా బాగుంది అంటూ బైడెన్ శ్వేతసౌధంలో నిలబడి మీడియా వర్గాలకు అభివాదం చేశారు. సెనెట్‌లో చర్చకు వచ్చిన వాతావరణ, వైద్య బిల్లు కూడా ఆమోదం పొందుతుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు. త్వరలో అధ్యక్షుడు మళ్లీ ప్రజాజీవితంలో పుఃప్రవేశిస్తారని ఆయన వైద్యుడు కెవిన్ ఓ కానర్ తెలిపారు. కరోనా నుంచి బయటపడిన తరువాత కూడా బైడెన్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని వైద్యులు రీబౌండ్ పాజిటివిటీ అని పిలుస్తున్నారు. వ్యాధి నయమైనప్పటికీ కొన్ని సందర్భాల్లో కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ రావడాన్ని రిబౌండ్ పాజిటివ్ అని పిలుస్తారు.  



Updated Date - 2022-08-08T03:42:17+05:30 IST