35 ఏళ్లుగా Americaలోనే ఉంటున్న NRI.. భారత్‌లోని తన స్థలాన్ని కబ్జా చేశారని ఫిర్యాదు చేస్తే పోలీసుల రియాక్షన్ ఇదీ..!

ABN , First Publish Date - 2022-06-25T01:20:30+05:30 IST

అమెరికాలో 35 ఏళ్లుగా ఉంటున్న NRIకి భారత్‌లోని పరిస్థితలు భారీ షాకిచ్చాయి. తన జాగా కబ్జాకు గురైందంటూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయించేందుకు దాదపు రెండున్నర నెలల పట్టడంతో ఆయన ఆశ్చర్యపోయారు.

35 ఏళ్లుగా Americaలోనే ఉంటున్న NRI.. భారత్‌లోని తన స్థలాన్ని కబ్జా చేశారని ఫిర్యాదు చేస్తే పోలీసుల రియాక్షన్ ఇదీ..!

ఎన్నారై డెస్క్: అమెరికాలో 35 ఏళ్లుగా ఉంటున్న NRIకి భారత్‌లోని పరిస్థితులు భారీ షాకిచ్చాయి. తన జాగా కబ్జాకు గురైందంటూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయించేందుకు దాదాపు రెండున్నర నెలల పట్టడంతో ఆయన ఆశ్చర్యపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జస్వంత్ సింగ్ మూడు దశాబ్దాలకుపైగా అమెరికాలో నివసిస్తున్నారు. చిన్నతనంలోనే ఆయన అమెరికాకు వెళ్లారు. అయితే.. అమృత్‌సర్‌ జిల్లాలోని సంగ్నా(Sanghna) గ్రామంలో జస్వంత్‌కు కొంత వ్యవసాయ భూమి ఉంది. అది కబ్జాకు గురైనట్టు ఇటీవల తెలియడంతో ఆయన హుటాహుటీన ఇండియాకు వచ్చారు. ఆక్రమణదారులను నుంచి తన భూమిని వెనక్కు తెచ్చుకునేందుకు ఆయన పోలీసులను ఆశ్రయించాలనుకున్నారు. అయితే.. ఇంతకాలం అమెరికా వ్యవస్థలకు అలవాటుపడిపోయిన జస్వంత్.. తన ఫిర్యాదుపై స్థానిక పోలీసులు కూడా వెనువెంటనే స్పందించి పరిష్కారం చూపుతారని భావించారు. 


కానీ..ఆ తరువాత ఆయనకు వాస్తవం బోధపడి దిమ్మతిరిగింది. కేసు నమోదు చేయకుండా స్థానిక పోలీసులు ఏకంగా రెండున్నర నెలల పాటు కాలయాపన చేశారు. జస్వంత్‌కు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో ఆయన తనకున్న పాత పరిచయాల ద్వారా పని జరిపించేందుకు విశ్వప్రయత్నం చేశారు. చివరకు విషయం ఎన్నారై వ్యవహారాల మంత్రికి తెలియడంతో ఎట్టకేలకు పోలీసు కేసు నమోదైంది. ఒక కేసు రిజిస్టర్ చేయడంలో ఇంత కష్టముంటుందా అనుకుంటూ ఆశ్చర్యపోవడం జస్వంత్ వంతైంది. ‘‘భారత్‌కు వచ్చిన ప్రతిసారీ మనసు స్వాంతన పొందేది. కానీ..ఈసారి మాత్రం పరిస్థితులు అస్సలు అనుకూలించలేదు. చిన్నప్పుడే అమెరికాకు వెళ్లిపోవడంతో ఇక్కడి వ్యవస్థలపై నాకు అంత అవగాహన లేదు. ఒక పోలీస్ కేసు ఫైల్ చేసేందుకు నాకు దాదాపు రెండున్నర నెలలు పట్టింది. అదే అమెరికాలో అయితే ఒక్క ఫోన్ చేస్తే చాలు పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుంటారు.’’ అని ఆయన వాపోయారు. తాను విదేశాల్లో ఉంటానని తెలిసే నిందితులు తన జాగాను కబ్జా చేశారని పేర్కొన్నారు. ఎన్నారైల ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్నారై సెల్(NRI Cell)  కూడా ఆశించిన రీతిలో పనిచేయట్లేదన్నారు. ఎన్నారైల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా జస్వంత్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-25T01:20:30+05:30 IST