కెనడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ విద్యార్థుల నిరసన..!

ABN , First Publish Date - 2022-03-05T15:49:32+05:30 IST

ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థులను అక్కడి మూడు ప్రైవేటు కాలేజీలు ఇటీవల రోడ్డున పడేసిన సంగతి తెలిసిందే.

కెనడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ విద్యార్థుల నిరసన..!

టొరంటో: ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థులను అక్కడి మూడు ప్రైవేటు కాలేజీలు ఇటీవల రోడ్డున పడేసిన సంగతి తెలిసిందే. జనవరిలో ఉన్నట్టుండి దివాలా ప్రకటన చేసిన మాంట్రియల్‌ నగరంలోని సీసీఎస్‌క్యూ కాలేజీ, ఎం కాలేజీ, సీడీఈ కాలేజీలు విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేశాయి. ఈ మూడు కాలేజీల్లో కలిపి సుమారు 2వేల మంది భారతీయ విద్యార్థులు వివిధ కోర్సులు చదువుతున్నారు. కాగా, దివాలా ప్రకటనకు కొద్ది రోజుల ముందు సదరు కాలేజీలు విద్యార్థుల నుంచి లక్షల రూపాయాల్లో ఫీజలు వసూలు చేశాయి. దీంతో అటు డబ్బులు పోగొట్టుకుని ఇటు అర్థాంతరంగా చదువు ఆగిపోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ క్రమంలో విద్యార్థులు తమకు న్యాయం చేయాలని టొరంటోలో గత నెలలో ఆందోళనకు దిగారు. మరోసారి ఇండియన్-మాంట్రియల్ యూత్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు శుక్రవారం నాడు ఇండస్ట్రియల్ ఏరియాలోని కెనడియన్ కాన్సులేట్ వైపు కవాతు చేపట్టారు. ఈ మూడు కాలేజీల నుంచి తాము కట్టిన ఫీజులను వెంటనే తిరిగి చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకు దిగిన విద్యార్థులు కెనడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Updated Date - 2022-03-05T15:49:32+05:30 IST