రూ.300కోట్ల భారీ మోసం.. America లో భారత సంతతి వ్యక్తి అరెస్ట్!

ABN , First Publish Date - 2022-07-01T19:49:43+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో నీల్‌ చంద్రన్‌ అనే 50 ఏళ్ల భారత సంతతి వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు.

రూ.300కోట్ల భారీ మోసం.. America లో భారత సంతతి వ్యక్తి అరెస్ట్!

లాస్ వెగాస్: అగ్రరాజ్యం అమెరికాలో నీల్‌ చంద్రన్‌ అనే 50 ఏళ్ల భారత సంతతి వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఒకటికాదు రెండుకాదు ఏకంగా రూ. 300 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు యూఎస్ న్యాయస్థానం (US Court) వెల్లడించింది. చంద్రన్‌ తన కంపెనీలలోని పెట్టుబడుదారులకు అధిక ఆదాయం ఆశ చూపి సుమారు 10 వేలమందిని మోసం చేసినట్లు కోర్టు విచారణలో తేలింది. దీంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు చంద్రన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... నెవెడా (Nevada)లోని లాస్ వేగాస్‌ (Las Vegas)లో ఉండే నీల్ చంద్రన్ 'ViRSE' అనే పేరుతో ఓ ఇన్వేస్ట్‌మెంట్ సంస్థను నడిపిస్తున్నాడు. దీనికి అనుబంధంగా Free Vi Lab, Studio Vi Inc., ViDelivery Inc, ViMarket Inc, Skalex USA Inc వంటి ఇతర ఫేక్ కంపెనీలు నడిపిస్తున్నట్లు కోర్టు విచారణలో తేలింది. ఈ సంస్థలో పెట్టుబడిదారులకు ఎక్కువ ఆదాయం వస్తున్నట్లుగా చూపించి చంద్రన్‌ వాటి ద్వారా భారీ మోసానికి పాల్పడ్డాడు. ఈ కంపెనీలు సంపన్న కొనుగొలుదారుల కన్సార్టియం ద్వారా కొనగోలు చేయబడుతోందంటూ తప్పుడు సాక్ష్యాలు చూపించాడు.


వాస్తవానికి అతని కంపెనీలో సంపన్న కొనుగోలుదారులు ఉంటేనే పెట్టుబడుదారలకు ఆదాయం వస్తుంది. కానీ చంద్రన్‌ కంపెనీలో నిజానికి అలాంటి సంపన్న కొనుగోలుదారులు ఒక్కరు కూడా లేరు. ఇలా లేని సంపన్న కొనుగోలుదారులను సృష్టించి తన కంపెనీలో పెట్టుబడులు పెట్టినవారిని మోసం చేశాడు. దీంతో అతనిపై మూడు ఫ్రాడ్‌ కేసులతో పాటు అక్రమ లావాదేవీలు నిర్వహించినందుకు మరో రెండు నమోదు అయ్యాయి. కాగా, చంద్రన్‌పై మోపబడిన ఈ అభియోగాలు రూజువైతే మూడు ఫ్రాడ్‌ కేసుల్లో ఒక్కొక్క కేసుకి 20 ఏళ్లు చొప్పున జైలు శిక్ష పడుతుంది. అలాగే అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించిన రెండు కేసుల్లో ఒక్కొక్క కేసుకి 10 ఏళ్లు చొప్పున జైలు శిక్ష పడుతుందని న్యాయస్థానం పేర్కొంది. అంతేగాక చంద్రన్‌కు సంబంధించిన 39 టెస్లా వాహనాలు, 100 వేర్వేరు ఆస్తులు, ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తులు ఈ మోసాల ద్వారా సంపాదించిన ఆస్తులుగా పరిగణిస్తూ జప్తు చేయాల్సిందిగా కోర్టు అధికారులను ఆదేశించింది. 

Updated Date - 2022-07-01T19:49:43+05:30 IST