జీవిత భాగస్వామి కోసం ఈ ఎన్నారై పడుతున్న పాట్లు మాములుగా లేవు.. ఏకంగా బిల్‌బోర్డ్స్‌పైనే..!
ABN , First Publish Date - 2022-03-09T21:01:12+05:30 IST
ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో ఉండే ఓ ఎన్నారై.. జీవిత భాగస్వామి కోసం పడుతున్న పాట్లు మాములుగా లేవు.

లండన్: ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో ఉండే ఓ ఎన్నారై.. జీవిత భాగస్వామి కోసం పడుతున్న పాట్లు మాములుగా లేవు. లైఫ్ పాట్నర్ కోసం ఏకంగా బిల్‌బోర్డ్స్‌పై ప్రకటన ఇచ్చేంతవరకు వెళ్లాడు. దాని తాలూకు ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జీవన్ భాచు(31) అనే భారత సంతతి వ్యక్తి ఇలా రెండు పెద్ద బిల్‌బోర్డ్స్‌ను అద్దెకు తీసుకుని మరీ ప్రకటన ఇచ్చుకున్నాడు. దీనికోసం అతడు రెండు వారాలకు గాను రూ.2లక్షలు ఖర్చు చేశాడు. ఆక్స్‌ఫర్డ్ సర్కస్‌లోని సెంట్రల్ అండ్ బేకర్లూ లూప్ లైన్స్ ప్లాట్‌ఫార్మ్స్‌పై ఈ ప్రకటన బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక ఈ ప్రకటనలో జీవన్ పింక్ కలర్ సూట్ ధరించి ఉండగా.. 'బెస్ట్ ఇండియన్ యూ విల్ టేక్‌అవే' అనే క్యాప్షన్ కనిపిస్తోంది. అలాగే findJEEVANawife.com అనే వెబ్‌సైట్ అడ్రస్ కూడా ఉంది. ఇక ఈ యాడ్ ఇచ్చిన తర్వాత నుంచి తనకు 50 వరకు అప్లికేషన్స్ వచ్చినట్లు జీవన్ వెల్లడించాడు. వాటిలోంచి తన మనసుకు నచ్చిన అమ్మాయిని ఎంచుకుని పెళ్లాడ్తానని తెలిపాడు. ఇదిలాఉంటే.. గతేడాది అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన జీమ్ బేస్(66) అనే వ్యక్తి కూడా ఇదే కోవలో 'వాటెండ్ ఏ గూడ్ ఉమెన్' అనే క్యాప్షన్‌తో ఓ పెద్ద బిల్‌బోర్డు ఏర్పాటు చేయించారు. టెక్సాస్ హైవేపై ఏర్పాటు చేసిన ఈ బిల్‌బోర్డు అప్పుడు బాగా వైరల్ అయింది.
