ఉక్రెయిన్‌లో భారతీయులకు ఇండియన్ ఎంబసీ మరో కీలక సూచన!

ABN , First Publish Date - 2022-03-19T02:21:51+05:30 IST

ఉక్రెయిన్‌లో భారతీయుకులకు ఇండియన్ ఎంబసీ మరో కీలక సూచన చేసింది. తమ కార్యాకలాపాలు కొనసాగుతున్నాయని, కావాల్సిన వారు తమను సంప్రదించవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది.

ఉక్రెయిన్‌లో భారతీయులకు ఇండియన్ ఎంబసీ మరో కీలక సూచన!

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌లో భారతీయుకులకు ఇండియన్ ఎంబసీ మరో కీలక సూచన చేసింది. తమ కార్యాకలాపాలు కొనసాగుతున్నాయని, కావాల్సిన వారు తమను సంప్రదించవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయ కార్యాలయాన్ని కేంద్రం పోలాండ్‌ రాజధాని వార్సాకు తరలించిన విషయం తెలిసిందే. అయితే.. పోలాండ్‌లో తాము యథావిథిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తాజాగా పేర్కొంది. తమ ఫోన్ నెంబర్లను కూడా షేర్ చేసింది. 


కాగా.. ఉక్రెయిన్‌లో ఇప్పటికీ కనీసం 50 మంది భారతీయులు ఉన్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్జీ ఇటీవల తెలిపారు. వారిలో 15 నుంచి 20 మంది స్వదేశానికి తిరిగొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తిరిగి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరిట ఓ బృహత్ కార్యక్రమానికి తెరలేపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం..మొత్తం 22500 మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. Read more