Indian Consulate: భారతీయులకు కీలక సూచన.. కొత్త పాస్‌పోర్టుల దరఖాస్తుకు ఈ నెల 28 వరకు ఛాన్స్!

ABN , First Publish Date - 2022-08-11T00:48:55+05:30 IST

యూఏఈ(UAE)లోని భారతీయులకు అక్కడి ఇండియన్ కాన్సులేట్(Indian Consulate) కీలక సూచన చేసింది. వర్షాలు, వరదల్లో పాస్‌పోర్ట్ కోల్పోయిన భారతీయుల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు ప్రకటించింది. ఈ నెల 28 వరకు స్పెషల్ డ్రైవ్ కొన

Indian Consulate: భారతీయులకు కీలక సూచన.. కొత్త పాస్‌పోర్టుల దరఖాస్తుకు ఈ నెల 28 వరకు ఛాన్స్!

ఎన్నారై డెస్క్: యూఏఈ(UAE)లోని భారతీయులకు అక్కడి ఇండియన్ కాన్సులేట్(Indian Consulate) కీలక సూచన చేసింది. వర్షాలు, వరదల్లో పాస్‌పోర్ట్ కోల్పోయిన భారతీయుల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు ప్రకటించింది. ఈ నెల 28 వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని.. కొత్త పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకొనే వెల్లడించింది. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఎడారి దేశమైన యూఏఈని వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. వర్షపు నీళ్లు(Rain water) లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోవడంతో.. కొన్ని భారతీయులు నివసించే ఇళ్లు జలమయం అయ్యాయి. దీంతో స్థానిక అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో కొంత మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను కోల్పోగా.. మరికొందరి పాస్‌పోర్ట్‌లేమో ధ్వంసం అయ్యాయి. ఈ విషయం ఇండియన్ కన్సాలేట్ దృష్టికి రావడంతో స్పందించింది. వరదల్లో పాస్‌పోర్ట్‌(passports) లు కోల్పోయిన భారతీయుల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. కొత్త పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పాస్‌పోర్టులు ధ్వంసం అయిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పింది. Fujairah, Kalba ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు సుమారు 80 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది. దుబాయిలో కూడా ఈ డ్రైవ్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ఈ నెల 28 వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. 


Updated Date - 2022-08-11T00:48:55+05:30 IST