NRI: భారతీయులకు కేంద్రం హెచ్చరిక.. కెనడా వెళ్లాలనుకుంటున్నారా..అయితే..

ABN , First Publish Date - 2022-09-24T01:34:51+05:30 IST

కెనడాలో(Canada) భారతీయులే లక్ష్యంగా గల ద్వేషపూరిత నేరాల(Hate Crimes) సంఖ్య పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం(Indian government) ఆందోళన వ్యక్తం చేసింది.

NRI: భారతీయులకు కేంద్రం హెచ్చరిక.. కెనడా వెళ్లాలనుకుంటున్నారా..అయితే..

ఎన్నారై డెస్క్: కెనడాలో(Canada) భారతీయులే లక్ష్యంగా గల ద్వేషపూరిత నేరాల(Hate Crimes) సంఖ్య పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం(Indian government) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ.. కెనడాలో నివసిస్తున్న భారతీయలతో పాటూ విద్యా, ఉద్యోగాది కారణాలతో అక్కడికి వెళ్లాలనుకుంటున్న వారిని గురువారం హెచ్చరించింది. ఈ మేరకు ఓ ప్రకటన(advisory) జారీ చేసింది. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, వర్గాలమధ్య హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని కూడా అందులో పేర్కొంది. ఈ అంశాలను.. కెనడాలోని భారత విదేశాంగ శాఖ అధికారులు, దౌత్యఅధికారులు కెనడా దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా విదేశాంగ శాఖ తెలిపింది. ద్వేషపూరిత ఘటనల వెనుకున్న నేరగాళ్లకు ఇప్పటివరకూ శిక్ష పడలేదని కూడా పేర్కొంది. 


ఈ నేపథ్యంలో.. కెనడాకు వెళ్లాలనుకుంటున్న భారతీయులు.. అప్రమత్తంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. కెనడాలో ఉంటుంన్న భారతీయ పౌరులు, విద్యార్థులు తమ పేర్లను..అక్కడి భారత రాయబార కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలని కూడా సూచించింది. అత్యవసర సందర్భాల్లో భారతీయ విద్యార్థులు కెనడాలోని భారతీయుల సులువుగా సాయం పొందేందుకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.  


ఖలిస్తాన్ రెఫరెండం..

కెనడాలో ఖలిస్తానీ అనుకూల రెఫరెండం(Khalistani Referendum) జరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ భారతీయులకు ఈ సూచనలు జారీ చేసింది. పంజాబ్‌కు స్వాతంత్ర్యాన్ని ఇచ్చి ఖలిస్థాన్ పేరిట ప్రత్యేకదేశం ఏర్పాటు చేయాలంటూ సెప్టెంబర్ 19న వేర్పాటువాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’(Sikhs For Justice).. ఓ రెఫరెండం నిర్వహించింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్నాయంటూ అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే.. ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న రెఫరెండంను అడ్డుకోబోమని కెనడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. 2019లో కేంద్రం సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థను చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటిస్తూ నిషేధం విధించింది. 

Updated Date - 2022-09-24T01:34:51+05:30 IST