ఆస్ట్రేలియాలో హైదరాబాద్ యువకుడి మృతి!

ABN , First Publish Date - 2022-03-11T15:16:41+05:30 IST

ఆస్ట్రేలియాలో ఉంటున్న ఓ యువకుడు స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతిచెందాడు. కొడుకు వద్దకు వెళ్లేందుకు అంతకుముందే ఏర్పాట్లు చేసుకుంటున్న తల్లిదండ్రులు అతని మరణవార్త విని తల్లడిల్లిపోయారు. సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌బజార్‌కు చెందిన రాచకొండ శ్రీనివాస్‌, అరుణల కుమారుడు సాయి సూర్యతేజ(25) ఉన్నత చదువులకోసం 2019లో ఆస్ట్రేలియా వెళ్లాడు.

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ యువకుడి మృతి!

హైదరాబాద్ సిటీ/రెజిమెంటల్‌బజార్‌: ఆస్ట్రేలియాలో ఉంటున్న ఓ యువకుడు స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతిచెందాడు. కొడుకు వద్దకు వెళ్లేందుకు అంతకుముందే ఏర్పాట్లు చేసుకుంటున్న తల్లిదండ్రులు అతని మరణవార్త విని తల్లడిల్లిపోయారు. సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌బజార్‌కు చెందిన రాచకొండ శ్రీనివాస్‌, అరుణల కుమారుడు సాయి సూర్యతేజ(25) ఉన్నత చదువులకోసం 2019లో ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. 2020లో ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్నాడు. కొవిడ్‌ నిబంధనల కారణంగా అప్పట్లో తల్లిదండ్రులు అతడిని చూసేందుకు వెళ్లలేకపోయారు. అయితే, వైద్యుల సలహా మేరకు ఏప్రిల్‌లో కాలుకు శస్త్ర చికిత్స చేయించుకోవడానికి అతను నిర్ణయించుకుని తల్లిదండ్రులను ఆస్ట్రేలియాకు రమ్మని కబురు పెట్టాడు. దీంతో వారు ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఫిజియోథెరపి చికిత్సలో భాగంగా ఈనెల 7న ఆస్ట్రేలియాలోని రివర్‌వ్యూ హోటల్‌లో గోల్డ్‌కోస్ట్‌ స్విమ్మింగ్‌పూల్‌లో సాయి సూర్యతేజ వ్యాయామం చేస్తుండగా అందులో మునిగి మృతి చెందాడు. అతని స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారం ఆందించారు. మృతదేహం ఈనెల 13 లేదా 14న నగరానికి చేరే అవకాశం ఉన్నట్లు తెలిసింది.     

Updated Date - 2022-03-11T15:16:41+05:30 IST